సినిమాల్లేక లోదుస్తుల్లో ఇలా!!

0


బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా.. పదేళ్ల క్రితం మిస్ ఇండియా కిరీట ధారిణి. ఆ టైటిల్ నెగ్గిన తర్వాత వెంటనే సినిమా అవకాశాలు వచ్చేయలేదు కానీ.. మోడలింగ్ లో బాగానే వెలిగింది. మెల్లగా యాక్టింగ్ లో ట్రైనింగ్ అయిపోయి.. సినిమాల్లో అడుగు పెట్టేసింది. మొదట్లో అవకాశాలు వెంటవెంటనే వచ్చేశాయి కానీ.. ఆ తర్వాత మాత్రం అవకాశాలు అడుగంటిపోయాయి. కొంతకాలంగా మరీ స్పెషల్ సాంగులకే పరిమితం అయిపోతోన్న ఈ భామ.. రీసెంట్ గా కమాండో2 చిత్రంలో విలన్ గా యాక్ట్ చేసేసింది.

ఇప్పుడు జనాల టెంపరేచర్ పెంచేసి.. బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు పట్టేసేందుకు కొత్త రూట్ ను ఎంచుకుంది ఈమాజీ మిస్ ఇండియా. ఈమెకు సంబంధించిన ఓ అప్ కమింగ్ వీడియోకి ఓ చిన్నపాటి టీజర్ ను కట్ చేయగా.. దాన్ని నెట్ లో పెట్టేసింది ఈ బ్యూటీ. తాను ఏ రేంజ్ లో పరువాలను పంచగలదో చెప్పేసింది ఈషా గుప్తా. కేవలం లోదుస్తుల్లోనే కనిపిస్తున్న ఈ వీడియోకు క్యాప్షన్ ఏంటో తెలుసా.. ‘ఈషా గుప్తా మీ మతి పోగొట్టేస్తుందంతే’ అనే అర్ధం వచ్చేలా క్యాప్షన్ తగిలించారు.

ఆ టీజర్ ను చూస్తే ఆ సెంటెన్స్ కరెక్ట్ అనిపించక మానదు. ఓ సారి టూ పీస్ అండర్ గార్మెంట్స్ లో కనిపించిన ఈషా గుప్తా.. ఆ తర్వాతి షాట్ లో వైట్ కలర్ టాప్ కనిపిస్తుంది. అంతేనా.. నడుముల వరకు ఉండే ట్రాన్స్ పరెంట్ టాప్ మినహాయిస్తే.. బాటమ్ ఏమీ వేసుకోలేదనే భ్రమ కలిగించడంలో టీం బాగానే సక్సెస్ అయ్యారు. అవకాశాల కోసం ఈషా గుప్తా చేస్తున్న ఈ రేంజ్ ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో!