మగతనానికి నో సవాల్స్ అనేసిందే!!

0Esha-Gupta-in-Veedevadu-Movieఅందం అనేది ఎంత దాచుకుంటే అంత మంచిది అనే రోజులు మర్చిపోయేలా చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. వయసులో ఉన్నప్పుడే గ్లామర్ గర్ల్ గా కొందరు ఎదగాలి అనుకుంటుంటే.. మరికొందరు అందరి చూపు తమవైపే ఉండాలనే కోణంలో ఇష్టం వచ్చినట్లు అందాలను ఆరబోస్తున్నారు. ఇక ఈ మధ్య ఫోటో షూట్స్ తో ప్రతి హీరోయిన్ జనాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకొని సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయోగాలు చేస్తున్నారు.

ఆ దారిలో నడిచి ఇప్పుడు మంచి ఆఫర్లను దక్కించుకుంటున్న భామ ఈషా గుప్తా. రీసెంట్ గా బాలీవుడ్ లో బాద్షాహో సినిమాలో అందాలను బాగానే ఆరబోసిన ఈ భామ సౌత్ ప్రేక్షకులకు మాత్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు అరచేతులు అడ్డుపెట్టుకొని అందాలన్నీ అందరికోసం అని చెప్పిన ఈ భామ సౌత్ జనాలకు ఏ మాత్రం గ్లామర్ షోను అందించలేకపోయింది. సచిన్ జోషి ‘వీడెవడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈషా గుప్తా పద్ధతి గా కనిపించి ప్రేక్షకుడి తాపాన్ని నీరుగార్చింది. వీడెవడు సినిమా కోసం మొదట ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు కానీ ఈషా గుప్తా హీరోయిన్ అని తెలియగానే కుర్రకారు మొదటి షోకే గుంపులు గుంపులుగా వెళ్లారు. తీరా సినిమాలో అమ్మడు చుడిదార్ మరియు చీర కట్టులో దర్శనం ఇవ్వడంతో సౌత్ యువత సరదా అంతా కనిపించకుండా పోయిందట. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ అందాల ప్రదర్శన.. కనీసం ఒక్క సీన్ లో కూడా లేదని గ్లామర్ బాబులు డిజప్పాయింట్ అవుతున్నారు.

అప్పట్లో ఈ అమ్మడు.. ”నా అందాలు మగతనానికి సవాల్” అంటూ పంచ్ విసిరిన సంగతి తెలసిందే. కాని ఇప్పుడు మాత్రం అలాంటి సవాల్స్ ఏమీ లేకుండానే ఈ సినిమా పూర్తి చేసింది. ఒకవేళ సౌత్ లో జనాలకు అలాంటివి ఇష్టం ఉండదేమో అనుకుందో గాని అమ్మడు మాత్రం ఫైనల్ గా నిరాశపరిచిందనే చెప్పాలి.