ఎడారిలో గజ్జెల గుర్రం

0టాప్ మోడల్ – సీనియర్ కథానాయిక ఇషా గుప్తా హొయలు గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన పనేలేదు. ర్యాంప్ వాక్ లతో నగరాన్ని నిరంతరం అట్టుడికించే భామగా ఇషాకి ఐడెంటిటీ ఉంది. ఇటీవలే అర్థనగ్న ఫోటోషూట్ తో వాడి వేడిగా చర్చల్లోకొచ్చింది. ఈ భామ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్లతో అంతర్జాలంపైనా విరుచుకుపడుతూనే ఉంటుంది. ఇదిగో ఈ సిరీస్ లోనే ఈ కొత్త ఫోటోషూట్ ఒకటి ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

ఇషాగుప్తా ఈ ఫోజులో మునుపెన్నడూ కనిపించనంత హాట్ గా కనిపిస్తోంది. ఎడారిలో గజ్జెల గుర్రంలా.. ఒంటరిగా చిక్కుకున్న గిరిజన బిజిలీలా వేడెక్కిస్తోంది. ఆ ఒంటి నిండా స్పెషల్ గా డిజైన్ చేసిన బోల్డ్ బొండుమల్లి తరహా ఆభరణాల్ని ధరించి ప్రత్యేకంగా కనిపిస్తోంది. కాళ్లకు గజ్జెలు .. మెడలో ఆ భీకరమైన డిజైనర్ కడియాలతో న్యూలుక్ ఆకట్టుకుంటోంది. ఆ డిజైన్కి తగ్గట్టే కిల్లింగ్ లుక్స్ తో మైమరిపిస్తోంది.

కెరీర్ పరంగానూ ఇషా లైనప్ మామూలుగా ఏం లేదు. ఇప్పటికిప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అక్షయ్ కుమార్ సరసన హేరాఫేరి 3 – అజయ్ దేవగన్ – టోటల్ ధమాల్ – జెపి దత్తా- పాల్తాన్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. డెవిల్స్ డాటర్ – దేశీ మ్యాజిక్ – వన్ డే వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. అందుకే ఇదిగో ఇలా తనదైన స్టైల్లో ఫోటోషూట్లతోనూ మెరుపులు మెరిపిస్తోంది.