మహర్షి ఇంపాక్ట్.. లగడపాటి సినిమా వాయిదా

0

ఈ సమ్మర్లో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో అన్నిటికంటే ప్రముఖమైనది సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుండడంతో ఆరోజు ఇక వేరే సినిమాలు ఏవీ పోటీగా రావడం లేదు. అయితే ‘మహర్షి’ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ లో కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. అల్లు శిరీష్ ‘ఎబీసీడీ’.. ‘అర్జున్ సురవరం’.. ‘ఫలక్ నుమాదాస్’.. ‘ఎవడూ తక్కువ కాదు’ సినిమాలు ‘మహర్షి’ రిలీజ్ అయిన తర్వాత వారంలో రిలీజ్ కావాలిసి ఉంది. కానీ ఇప్పుడు వాటిలో కొన్ని సినిమాలు వాయిదాకు రెడీ అవుతున్నాయట.

‘మహర్షి’ పై ఉన్న క్రేజ్.. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెరిగిన పాజిటివ్ బజ్ తో నెక్స్ట్ వీక్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల మేకర్స్ పునరాలోచనలో పడ్డారట. విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటించిన ‘ఎవడు తక్కువ కాదు’ ను ఏప్రిల్ 24 కు వాయిదా వేశారని సమాచారం. విక్రమ్ సహిదేవ్ గతంలో ‘నాపేరు సూర్య’ చిత్రంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ‘గోలీసోడా’ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను మెప్పించింది.

ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే ‘అర్జున్ సురవరం’ మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ‘ఫలక్ నుమాదాస్’ విడుదల సంగతి కూడా తేలాల్సి ఉంది. అయితే అల్లు శిరీష్ చిత్రం ‘ఎబీసిడీ’ మాత్రం మే 17 న పక్కగా రిలీజ్ అవుతుందని నిర్మాత మథుర శ్రీధర్ తెలిపారు.
Please Read Disclaimer