కొడుకులు దిద్దిన ఆ హీరో కాపురం

0బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే.. విడిపోవడాలు ఎక్కువే.. కానీ కొన్ని రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనుకున్న బంధాల గురించి అర్థం కాదు.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు కూడా భార్య పిల్లల గురించి తెలిసొచ్చింది. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న హృతిక్ రోషన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

హృతిక్ రోషన్ 14 ఏళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ లోనే బెస్ట్ కపూల్స్ గా వీరిద్దరూ నిలిచారు. వారి మధ్య అన్నోన్యం కూడా అలా కొనసాగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా హ్రీహాన్ – హ్రీదాన్ ఇద్దరు కొడుకులున్నారు. అయితే హీరోయిన్ కంగనారౌనత్ తో హృతిక్ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారి వివాహ బంధానికి బీటలు వారింది. హృతిక్-సుసానే భార్యభర్తలుగా విడిపోయినా కూడా వీరిద్దరూ స్నేహితులుగా ఉంటున్నారు. హృతిక్ తన పిల్లలను ఫారిన్ ట్రిప్ లకు తీసుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొడుకుల కోసం మళ్లీ ఈ జంట ఒక్కటి అయ్యేందుకు సిద్ధమయ్యారనే వార్త బాలీవుడ్ లో వినిపిస్తోంది. హీరోయిన్స్ తో ఎఫైర్ అన్నీ వదులుకున్న హృతిక్ తన తప్పు తెలుసుకొని ఇప్పుడు మళ్లీ సుసానేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని వార్తలొస్తున్నాయి.