ఫన్ మోడ్ నో ఫ్రస్ట్రేషన్!

0విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ లు నటిస్తున్న క్రేజీ మల్టిస్టారర్ ‘F2’ షూటింగ్ ప్రస్తుతం ప్రేగ్ లోని అందమైన లోకేషన్స్ లో జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి లీడ్ హీరో లు వెంకీ – వరుణ్ లతో పాటు హీరోయిన్లు తమన్నా – మెహ్రీన్ లపై పాటను చిత్రీకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ఫోటో ను ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజనులతో పంచుకున్నాడు .

ఫన్ మోడ్ లో ఉన్నామని.. లవ్లీ సాంగ్స్ అందించినందుకు దేవీశ్రీ ప్రసాద్ సార్ కు థ్యాంక్ యు అని ట్వీట్ చేశాడు. ఇక లీడ్ యాక్టర్స్ తో పాటు తను కూడా నిలబడి తాము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడండి అన్నట్టుగా పోజు ఇచ్చాడు. ఫన్ మూడ్ కాబట్టి వెంకీ – వరుణ్ – తమన్నా – మెహ్రీన్ అందరూ ఫుల్ ఎనర్జీ తో ఉన్నారు. మరో పది రోజుల పాటు రెండు పాటల చిత్రీకరణ ప్రేగ్ లోనే సాగుతుందట.

దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ను సంక్రాంతి సీజన్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అసలే వెంకీ కామెడీ టైమింగ్ సూపర్.. వెంకీకి తోడుగా వరుణ్ కూడా ఉన్నాడు. ఈ టీమ్ ను చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ కంటే ఫన్నే ఎక్కుగా ఉన్నట్టుంది. వీటన్నిటికీ తోడు దేవీ సంగీతం.. పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలిం అనిపించడం లేదూ..?