ప్రేగ్ లో పాటలు ఫైట్లు – ఫన్ ఫ్రస్ట్రేషన్

0టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు మల్టిస్టారర్ సినిమాల్లో ‘F2’ ఒక క్రేజీ ప్రాజెక్ట్. వెంకటేష్ – వరుణ్ తేజ్ లు మొదటిసారి కలిసి నటిస్తుండడం.. పైగా ఎంటర్ టైనర్స్ ను మలచడంలో స్పెషలిస్టు అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో – ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రేగ్ లో జరగనుందట.

నిన్న రాత్రే ‘F2’ టీమ్ ప్రేగ్ కు పయనమై వెళ్లారట. రెండువారాల పాటు సాగే ఈ షెడ్యూల్ లో ఒక చేజింగ్ సీక్వెన్స్ – రెండు పాటలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ లో వెంకీ- వరుణ్ లతో పాటుగా హీరోయిన్ లు తమన్నా – మెహ్రీన్ కూడా పాల్గొంటారట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే ‘F2’ టీమ్ బ్యాంకాక్ కు బయలుదేరి వెళ్తారట. బ్యాంకాక్ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుందట.

ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తే రీచబిలిటీ ఎక్కువ ఉంటుందని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.