అక్కినేని కోడలు- 8 కఠోర నిజాలు!

0

`ఏమాయ చేశావే` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత.. డికేడ్ ప్రేమాయణం అనంతరం నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని కోడలు అయిన సంగతి తెలిసిందే. అక్కినేని ఇంట అడుగుపెట్టడమే కాదు పెళ్లి తర్వాత నాగచైతన్యకు కెరీర్ బెస్ట్ హిట్ ని అందించిన మేటి ప్రతిభావనిగా పేరు తెచ్చుకుంది. `మజిలీ` ఛాయిస్ సమంతదేనని చైతూ కూడా చెప్పారు. తనకో బ్లాక్ బస్టర్ ఇస్తానని ప్రామిస్ చేసి మరీ సమంత ఆ మాట నిలబెట్టుకున్నారు. అయితే ఇవన్నీ తెలిసిన కథలే కానీ.. అసలు సమంత గురించి ఇప్పటికీ అభిమానులకు తెలియని ఎమినిది కఠోర నిజాలేంటో చూద్దామా?

సమంత నటించిన తొలి సినిమా `విన్నయ్తాండి వరువాయా` (ఏమాయ చేశావే) కానే కాదు. గౌతమ్ మీనన్ తనని పరిచయం చేశారనడం కరెక్ట్ కాదు. సమంత అంతకుముందే ఎం.ఆర్.రవివర్మన్ దర్శకత్వం వహించిన `మాస్కో ఇన్ కావేరి` అనే చిత్రంలో నటించింది. అదే తన కెరీర్ తొలి సినిమా. అంటే రవివర్మన్ తనని పరిచయం చేశారనే దానర్థం. అలాగే సమంత కథానాయిక కాకముందు ఆర్థికంగా చాలానే ఇబ్బందులు ఎదుర్కొంది. 20 వయసులో రకరకాల పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసింది. ప్రస్తుతం సామ్ సన్నివేశమేంటో తెలిసిందే. ఒక్కో సినిమాకి 2కోట్ల పారితోషికం అందుకునే నాయికగా ఎదిగేశారు. సమంత రూత్ ప్రభు తన అసలు పేరు అని భావిస్తాం. అది ఓకే కానీ తనకి వేరొక పేరుంది తెలుసా? యశోద అని తనని ఇంట్లో పిలుస్తారట. స్నేహితులు కూడా అదే పేరుతో పిలుస్తారు.

సమంతకు నటిగా స్ఫూర్తి ఎవరో చెప్పగలరా? ప్రముఖ హాలీవుడ్ నటి ఆడ్రూ హెప్ బర్న్. రియలిస్టిక్ గా.. నేచురల్ గా నటించడం తన నుంచే నేర్చుకుంది సామ్. సమంత ఇష్టంగా తినే ఫుడ్ ఏదో తెలుసా? `సుషి` అనే జపనీ డిష్ తనకు ఇష్టం. ఉడికించిన సముద్ర ఆహారం (రొయ్యలు.. చేపలు.. పీతలు వగైరా) తో వెజిటబుల్స్ కలిపి తయారు చేసే రా మిక్స్ డ్ ఫుడ్ ఇది. అలాగే సమంత సుగర్ పేషెంట్ అన్నది తెలిసింది తక్కువ మందికే. 2013లోనే తనకు సుగర్ ఉందని డాక్టర్లు నిర్థారించారు. తన ఒరిజినల్ క్యారెక్టర్ నే త్రివిక్రమ్ `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రానికి ఉపయోగించుకున్నారు. ఆ చిత్రంలో కళ్లు తిరిగిపడిపోవడం అన్న కాన్సెప్టులో సామ్ ఎంతో సహజంగా జీవించడం వెనక కారణమిదే. ఇకపోతే ప్రత్యూష ఎన్జీవో సంస్థను స్థాపించిన సమంత ఎవరికి సాయం చేస్తోంది? అంటే పేద విద్యార్థులు.. ఆడవారికి ఎంతో సాయపడుతోంది. ప్రత్యూష గురించి కొంతవరకే తెలుసు.. తెలియని నిజాలెన్నో ఉన్నాయి. సామ్ గురించి ఇన్ని తెలియని విషయాలు ఉన్నాయన్నమాట. సమంత బర్త్ డేని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా .. అందరికోసం ఈ స్పెషల్ ఆర్టికల్..
Please Read Disclaimer