ఫిదా తో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!

0sai-pallavi-in-fidaaసాయి పల్లవి, మలయాళంలో వచ్చిన ప్రేమమ్ మూవీ తో ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలో అక్కడ తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. అయితే ఆ సినిమా చూసిన చాలా మంది సాయి పల్లవి యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు.

అయితే ఆమె తెలుగులో ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేసారు. ఇప్పుడు ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది. ఫిదా సినిమాలో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా విపరీతమైన అభిమానులని సొంతం చేసుకుంది.

ఈ సినిమా చూసిన అందరు చాలా వరకు సాయి పల్లవి ఫ్యాన్స్ అయిపోయారంటే. ఫిదా సినిమాలో ఆమె ఇంపాక్ట్ ఎ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో ఆమె టాప్ రేంజ్ లోకి వెళ్ళడం చాలా ఈజీగా జరిగిపోతుందని ఇప్పటికే సినిమా ప్రముఖులు కితాబు ఇచ్చేసారు.