యాంకర్ రవిని లైవ్ లో బూతులు తిట్టిన ఫ్యాన్స్

0టెక్నాలజీ పుణ్యమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో వచ్చేందుకు అవకాశం దక్కింది. స్టార్ హీరోల నుంచి.. యాంకర్ల వరకూ పలువురు తమ అభిప్రాయాలను ఫ్యాన్స్ కు తెలియచెప్పడంతో పాటు.. వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేందుకు లైవ్ ఛాట్ లను వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా యాంకర్ రవి ఇలాంటి ఒక లైవ్ ఛాట్ లో పాల్గొన్నాడు. ప్రధానంగా రవికి పటాస్ షో మీదే ఎక్కువగా పంచ్ లు పడ్డాయి. వాటికి పటాస్ రవి కూడా అదిరిపోయే పంచ్ లు ఇచ్చాడు. అంతేకాదు.. ఫాలోయర్స్ ను తిట్టేందుకు కూడా వెనకాడలేదు. ‘నీది.. శ్రీముఖిది ఓవరాక్షన్ చూడలేకపోతున్నాంరా అయ్యా’ అంటూ ఒక వ్యక్తి కామంట్ పెడితే.. ‘నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా.. దాన్ని ఛేంజ్ చెయ్యరా అయ్యా’ అంటూ ఆన్సర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

అయితే.. చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటామని.. అన్నీ ఒకరకంగానే ఉండవని.. సినిమాల్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తపడతారన్న రవి.. పటాస్ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన విధానమే ఫన్ కోసమని.. అందులో కాసిన్ని బూతు జోకులు పేలుతున్న విషయం తనకు తెలుసని చెప్పాడు. అలాగే శ్రీముఖితో అఫైర్ ఉందంటూ కొంతమంది రాస్తున్నారని.. ఇలాంటి వాళ్లను నరికేయమని ఓ ఫ్యాన్ సలహా ఇచ్చాడు. తమ గురించి మంచో చెడో ఏదో ఒకటి రాస్తున్నారంటే.. తాము వాళ్ల మైండ్ లోఉన్నట్లే కాబట్టి.. ఏదైనా రాసుకోమని చెబుతానని.. అలా తాము మరింత ఎక్కువగా ఫేమ్ సంపాదించుకుంటామని ఓపెన్ గా చెప్పేశాడు పటాస్ రవి.