ఆలియాకు ముద్దు పెట్టే అవకాశమే వస్తే..

0Alia-Bhatt-Allowed-Kissingఅందాల సుందరి.. చూడచక్కని సొగసరి.. వీటన్నింటికి తోడు బాలీవుడ్ టాప్ హీరోయిన్. అసలు ఆమె ఆటోగ్రాఫ్ దొరకడమే కష్టం. ఫొటో తీసుకునే ఛాన్స్ దొరికితే లక్ దొరికినట్టే. అదే చెక్కిళ్లపై ముద్దు పెట్టే అవకాశం వచ్చిందంటే… అంతకు మించిన అదృష్టం ఏముంటుంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ ఈవెంట్ లో తనను ముద్దు పెట్టుకోవాలని ఆశించిన వారందరికీ అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఛాన్స్ ఇచ్చింది చిట్టిపొట్టి చిన్నారులకే.

ఆ మధ్య ఆలియా భట్ ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు అటెండ్ అయింది. అక్కడున్న వాళ్లంతా చిన్నపిల్లలే. అసలే చిన్నారులంటే ఎంతో ముచ్చట పడిపోయే ఆలియా అక్కడున్న అందరితో సరదాగా ఆడుతూ పాడుతూ గంతులేసింది. వాళ్లు చెప్పే కబుర్లన్నీ విని వాళ్లతో హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. ఇందులో భాగంగానే ముద్దుముద్దుగా ఉండే పిల్లలందరికీ తనను ముద్దు పెట్టుకునే అవకాశమిచ్చింది. తామెంతో ఇష్టపడే హీరోయిన్ కావడంతో పిల్లలంతా క్యూలో నుంచుని మరీ ఆమె బుగ్గపై తలో ముద్దు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ రకంగా చిన్నపిల్లల ప్రోగ్రాంకు వచ్చి చిన్నపిల్లలా మారిపోయి వాళ్లతో ఎంజాయ్ చేసింది ఆలియా.

ఈ ఏడాది ఇప్పటికే బద్రినాథ్ కీ దుల్హనియాతో ఆలియా ఖాతాలో ఓ హిట్ జమయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లోని టాప్ యంగ్ హీరోలందరి సినిమాల్లోనూ ఆలియానే హీరోయిన్ ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో రణ్ బీర్ కపూర్ పక్కన.. జోయా అఖ్తర్ డైరెక్షన్ లో గల్లీ బాయ్ సినిమాలో రణ్ వీర్ సింగ్ పక్కన హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు తన ఫస్ట్ సినిమా హీరో వరుణ్ ధావన్ తో ముచ్చటగా మూడో సినిమా చేస్తోంది. కరణ్ మల్హోత్రా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శుద్ధి సినిమాలో మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు.