షకీలా క్యాలెండర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

0

మలయాళం ఇండస్ట్రీని ఒకప్పుడు ఒక ఊపు ఊపిన నటి షకీలా. ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు స్టార్ హీరోలు సైతం వారి సినిమాల రిలీజ్ వాయిదా వేసుకునేవారు. అప్పట్లో ఈ బి గ్రేడ్ యాక్టర్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే జనాల సంఖ్య చాలా ఉండేది. ఇక ఇప్పుడు ఓ వర్గం ఆడియెన్స్ ఆమె బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రస్తుతానికైతే ఆమె బయోపిక్ స్పెషల్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిచా చద్దా షకీలా బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ చాలా స్పెషల్ గా ఉండాలని ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ కొత్తగా ఆలోచిస్తోంది. షకీలాగా రిచా విభిన్నమైన గెటప్స్ లో కనిపించనుంది. అయితే గెటప్స్ కు సంబందించిన స్టిల్స్ తో 2019 క్యాలెండర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారట.

ఈ విషయాన్నీ కథానాయిక రిచా చెప్పడంతో షకీలా ఫ్యాన్స్ క్యాలెండర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంద్రజిత్ దర్శకత్వం వహిస్తున్న షకీలా బయోపిక్ హిందీ – తమిళ్ అలాగే తెలుగు మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Please Read Disclaimer