తాప్సీకే ఝలక్ పడిందే!

0

బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది తాప్సీ. దిల్లీ క్వీన్ అనూహ్యంగా ముంబై పరిశ్రమను ఏల్తోంది. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన ఏ ఇతర కథానాయికకు లేనంత ఆదరణ – గుర్తింపు తాప్సీకి దక్కుతోంది. పింక్ – నామ్ షబానా చిత్రాలతో తనకు దక్కిన గౌరవమది. ఇటీవలే ముల్క్ – మన్మార్జియాన్ చిత్రాలతో సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. ముంబైలో తాప్సీ పీఆర్ కాంటాక్ట్స్ అంతే పవర్ ఫుల్ గా పని చేస్తున్నాయన్నది ఓ సమాచారం. ఇప్పటికిప్పుడు తాప్సీ ఓ కొత్త సినిమాకి సంతకం చేయాలంటే బిజీ షెడ్యూల్స్ వల్ల ఆలోచించుకోవాల్సిన సన్నివేశం ఉందిట. ఆ క్రమంలోనే అనురాగ్ బసు దర్శకత్వంలోని ఓ క్రేజీ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

ఇంతకీ ఏ సినిమా? అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇదివరకూ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో `లైఫ్ ఇన్ ఏ మెట్రో` అనే చిత్రం రిలీజై చక్కని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ నటనకు పేరొచ్చింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు అనురాగ్ బసు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే కాస్టింగ్ ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ కాస్టింగ్ నుంచి ఈసారి తాప్సీ మిస్సింగ్ అని తెలుస్తోంది.

తాజా సీక్వెల్ లో రాజ్ కుమార్ రావ్ – పరిణీతి చోప్రా – సైఫ్ ఖాన్ – అభిషేక్ బచ్చన్ – ఇషాన్ ఖత్తర్ – సోనాక్షి సిన్హా లాంటి స్టార్లు ఫైనల్ అయ్యారు. కానీ తాప్సీ ప్రాజెక్టు నుంచి తప్పుకుందిట. వాస్తవానికి ఈ సినిమా అనుకోగానే అనురాగ్ ప్రకటించిన తొలి పేరు తాప్సీ. కానీ తనకు కాల్షీట్ల సమస్య తలెత్తింది. తాప్సీ ప్రస్తుతం బద్లా అండ్ తడ్కా చిత్రాల్లో నటిస్తోంది. దాంతో ఆల్టర్నేట్ ని వెతుక్కోవాల్సి వచ్చిందిట. ఆ క్రమంలోనే దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ లైన్ లోకొచ్చింది. ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్లో ఛాన్స్ మిస్సవ్వడం అన్నది తాప్సీ ఊహించనిది. ఇక సనా షేక్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సనాకి తాజా క్రేజీ ఆఫర్ బోనస్ లాంటిది. ఒకవేళ తాప్సీకి కుదరకపోతే ఇమ్మీడియట్ ఆప్షన్ గా సనానే అనుకున్నాడట అనురాగ్ బసు. మెట్రో నగరాల్లో జీవితాలపై తీస్తున్న సీక్వెల్ చిత్రమిది.
Please Read Disclaimer