కలెక్షన్లలో ఫుల్ ‘ఫిదా’.. వ‌ర‌ల్డ్‌వైడ్ రికార్డు

0fidaa-collections-unstoppableశేఖర్ కమ్ముల తీసిన అద్భుత ప్రేమకావ్యం ఫిదా, ప్రేక్షకులందరినీ ఫిదా చేస్తూ, సూపర్‌డూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 60కోట్లు వసూలు చేసి దుమ్ములేపింది. దర్శకుడు శేఖర్‌కమ్ముల కెరీర్‌లెనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఫిదా నికార్సయిన తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఓ ప్రేమకథ. ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సాయిపల్లవి తెలుగుప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర పోషించి, బాన్సువాడ భానుమతిగా పేరు తెచ్చుకుంది.

రెండు వారాల షేర్ రూ.34.8కోట్లు కాగా, గ్రాస్ 60కోట్లుగా ఉందని నిర్మాణవర్గాలు తెలిపాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక చిత్రాల పరాజయంతో వెనుకబడిన శేఖర్‌కమ్ముల ఈ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకొచ్చాడు. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అమెరికాలోనూ తన హవా కొనసాగిస్తోంది. అక్కడి పంపిణీదారుల సమాచారం మేరకు ఫిదా 2 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడానికి కొంచెం దూరంలో ఉంది.