రెండవ పాటను సిద్ధం చేసిన ఫిదా టీమ్!

0Fidaa-Movie-Trailerమెగా యంగ్ హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ తన తాజా చిత్రం ‘ఫిదా’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్టీ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటం, టీజర్, ట్రైలర్ బాగుండటం, వరుణ్ తేజ్ సరసన ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

ఇక కొద్ది రోజుల క్రితమే విడుదలైన సినిమాలోని మొదటి పాట ‘పిల్లా మెల్లగా వచ్చిండే’ మంచి ఆదరణ పొందడంతో చిత్ర యూనిట్ రెండవ పాట ‘ఏదో జరుగుతోంది’ ని రేపు 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆడియో ఈవెంట్ వివరాల్ని కూడా ప్రకటించనున్నారు. జూలై 21న విడుదలకానున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.