చాంబర్ కొత్త అధ్యక్షుడి హామీలివే!

0అన్ని పరిశ్రమల్లానే టాలీవుడ్ కి బోలెడన్ని సమస్యలు. టాలీవుడ్ నాలుగు సెక్టార్లు(డిస్ట్రిబ్యూటర్ – నిర్మాతలు – స్టూడియోస్ – ఎగ్జిబిటర్) సహా 24 శాఖల్లో ఎన్నెన్నో సమస్యలున్నాయి. ఈ సమస్యలపై నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు వీరినాయుడు మాట్లాడారు. తెలుగు సినీపరిశ్రమ సమస్యల్ని పరిష్కరిస్తామని నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రకటించారు.

ప్రతియేటా నాలుగు సెక్టార్లలో ఒక్కో సెక్టార్ నుంచి అధ్యక్షుని ఎంపిక చేస్తుంటారు. ఈసారి పంపిణీదారుల విభాగం నుంచి నాకు ఈ అవకాశం వచ్చింది. వీరినాయుడు మాట్లాడుతూ-“ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాను కాబట్టి పరిశ్రమ అన్ని సెక్టార్ల సమస్యల గురించి తెలుసు. ఎగ్జిబిటర్లకు జీఎస్టీ సహా పలు రకాల సమస్యలు ఉన్నాయి. ధరలన్నీ తారా స్థాయిలో ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఏపీ – తెలంగాణ రెండుచోట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కనుగొంటాం. మాటీమ్ తో కలిసి అందకు కృషి చేస్తాను. అలానే డిజిటల్ లో సమస్యలున్నాయి. డిజిటల్ ప్రొవైడర్ల తరపు నుంచి సమస్యల్ని పరిష్కరిస్తాను. కొందరు డిజిటల్ ప్రొవైడర్లు మమ్మల్ని కలుస్తున్నారు. వాళ్లు ఇచ్చే సాంకేతికతలో క్వాలిటీ ఎలా ఉందో పరిశీలిస్తాం. ఈ సీజన్ లో మంచి పనులు చేస్తాను“ అని అన్నారు. తెలుగు ఫిలింఇండస్ట్రీకి అత్యున్నత స్థానంలో ఉన్న ట్రేడ్ బాడీ ఇది. అధ్యక్షునిగా ఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు.