అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం

0annapurna-studious-fire-accబంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది ‘మనం’ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలోని కింది భాగంలో సెట్టింగ్‌ వేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో సెట్‌ను ఆయన జ్ఞాపకంగా అలానే ఉంచారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సెట్టింగ్‌లో మంటలు చెలరేగాయి. మొత్తం ఐదు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నాగార్జున మాట్లాడుతూ.. ‘మనం’ సినిమా సెట్టింగ్‌ ప్రస్తుతం మూసివేసి ఉందని, అదృష్టవశాత్తూ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరన్నారు. నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఇక్కడే ఎక్కువ సమయం గడిపారన్నారు. ఇది తమకెంతో ఇష్టమైన స్థలమని, నాన్న గుర్తుకు వచ్చేచోటు అని కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకుపైగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని చెప్పారు.