ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఫ్రీడం సేల్‌: బంపర్‌ డీల్స్‌

0flipkart-big-freedom-salesప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ను ప్రకటించిన ఐదు రోజుల్లోనే మరో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇండిపెండెన్స్‌ డే సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్‌ ఫ్రీడం సేల్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని నిర్వహిస్తోంది. ఈ సేల్‌ ఆగస్టు 9న ప్రారంభమై, ఆగస్టు 11తో ముగుస్తోంది. బిగ్‌ ఫ్రీడం సేల్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, హెడ్‌ఫోన్లు, కెమెరాలు, యాక్ససరీస్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. షావోమి ఫ్యాన్స్‌కు కోసం రెడ్‌మి నోట్‌ 4 సేల్‌ను 72 గంటల పాటు నిర్వహించనున్నట్టు కూడా పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు అదనంగా తక్షణ డిస్కౌంట్లను అందించనున్నట్టు చెప్పింది.

మొబైల్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ ఆఫర్స్‌…

బిగ్‌ ఫ్రీడం సేల్‌ కోసం ముందస్తుగానే ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్‌లో పలు డిస్కౌంట్లను ఆవిష్కరించింది. రూ.16,999గా ఉన్న మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కి అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా రూ.15,999గా ఉన్న మోటో ఎం స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 12,499 రూపాయలుగా గల లెనోవో కే5 నోట్‌ను 9,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించనుంది. కే6 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. దీంతో 9999 రూపాయలుగా ఉన్న కే 6 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.8999కే లభ్యం కానుంది. గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 67వేల రూపాయల నుంచి 48,999 రూపాయలకు తగ్గించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అదేవిధంగా ఐఫోన్‌ 6, 32జీబీ మోడల్‌ ధరను కూడా తగ్గించినట్టు చెప్పింది.

రెడ్‌మి నోట్‌ 4ను మూడు రోజుల పాటు 1000 రూపాయల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించనుంది. కేవలం మొబైల్‌ ఫోన్లపైనే కాక ల్యాప్‌టాప్‌, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌లపై ఫ్లాట్‌పై 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది. ఈ సేల్‌లో కనీసం 71 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌లను ఆఫర్‌ చేస్తోంది. కాగ, అమెజాన్‌ కూడా ఆగస్టు 9వ తేదీ అర్థరాత్రి నుంచే గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ దిగ్గజం ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా 100 మిలియన్‌ ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచుతుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్‌ ఓన్లీ డీల్స్‌ను అమెజాన్‌ అందిస్తోంది.