ఆ మూవీస్ చేసినా అలా మాత్రం పిలవొద్దట

0

బాలయ్య లక్స్ పాప ఆషా సైనీ తెలుగులో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడింది. కాని తెలుగులో ఈమెకు కాలం కలిసి రాలేదు. సౌత్ నుండి బాలీవుడ్ కు వెళ్లి ప్రయత్నాలు చేసింది. దాదాపు పుష్కర కాలంగా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడకు వెళ్లిన తర్వాత పేరును ప్లోనా సైనీ గా మార్చుకుని ప్రయత్నాలు చేస్తోంది. అడపా దడపా వచ్చే అవకాశాలతో ఈమె కెరీర్ ను నెట్టుకు వస్తుంది. ఈ సమయంలోనే ఈమె కొన్ని అడల్ట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునేందుకు ఈమె చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటిగా బాలీవుడ్ లో అనుకుంటున్నారు.

తాజాగా ఈమె మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మీరు హాట్ హీరోయిన్ గా అడల్ట్ హీరోయిన్ గా ముద్ర పడిపోయారు అంటూ బయట టాక్ వినిపిస్తుంది మిమ్ముల అంతా కూడా హాట్ హీరోయిన్ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో మీడియా వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ తారలను అలా పిలవడం కరెక్ట్ కాదని – నటి అయినా కూడా ఒక మహిళ అనే విషయాన్ని గుర్తించి ఆమెకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్బంగా ప్లోరా చెప్పుకొచ్చింది.

నటి అనప్పుడు అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. నటిగా నిరూపించుకోవాలి అంటే అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే అది సాధ్యం అవుతుంది. మా ప్రతిభను నిరూపించుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలు అవి అలా అని మమ్ముల బోల్డ్ నటి అంటే ఎలా చెప్పండి. కాస్త బోల్డ్ గా ఉన్న పాత్రలో నటిస్తే మమ్ముల్ని విమర్శిస్తారు. అదే హీరోను అలా బోల్డ్ హీరో అంటూ వ్యాఖ్యలు చేయగలరా అంది. సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్స్ పై వివక్ష కొనసాగుతుందని ప్లోరా సైనీ ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేసిన పాత్రలను చూసి తనను తప్పుగా అర్థం చేసుకుని అలా పిలవద్దని పేర్కొంది.
Please Read Disclaimer