నెక్ట్స్ ఫ్రైడే.. ఆ నలుగురికి బిగ్ డే!

0వారం వారం రిలీజ్ లు మామూలే. ఫ్లాపులు కొన్ని – హిట్లు కొన్ని! హిట్టొస్తే ఆనందం – ఫ్లాపొస్తే నీరసం ఆవరించడం సహజం. సినిమాల్లో తెరపై చూపించే ఎమోషన్ ని మించి తెరవెనక ఎమోషన్ రాజుకుపోతుంటుంది. కోట్లకు కోట్లు డబ్బు వెదజల్లాలి. ఆరుగాలం శ్రమించి చివరికి సినిమా రిలీజ్ చేస్తే ఇలా అయ్యిందిరో దేవుడా! అని వాపోయే నిర్మాతలే ఎక్కువమంది కనిపిస్తారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో సక్సెస్ రేటు పెరగడం అన్న మాట వినబడడం మేకర్స్లో ఆశావహ దృక్పథాన్ని పెంచుతోంది.

అందుకే వారం వారం సినిమా రిలీజ్ల సంఖ్య పెరుగుతోంది. వచ్చే శుక్రవారం (ఆగస్టు 24) ఏకంగా నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. నీవెవరో – ఆటగాళ్లు – అంతకుమించి – లక్ష్మీ ఒకేరోజు రిలీజవుతూ వేడి పెంచుతున్నాయ్. వీటిలో ఆది- తాప్సీ లాంటి టాప్స్టార్లతో కోన తీసిన `నీవెవరో` ప్రచారం పరంగా ఒకడుగు ముందుంది. ఇక నారా రోహిత్- జగపతిబాబు కాంబో నటించిన `ఆటగాళ్లు` ఎప్పుడో రావాల్సింది.. ఇప్పటికి వస్తోంది. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రభుదేవా – బేబి దిత్య లాంటి టాప్ క్లాస్ డ్యాన్స్ పెర్ఫామర్స్ తో నాన్న ఫేం ఏ.ఎల్.విజయ్ తెరకెక్కించిన `లక్ష్మీ` ట్రైలర్ ఆకట్టుకుంది. డ్యాన్స్ బేస్డ్ సినిమా కాబట్టి దీనిపై అంచనాలు పెరిగాయి. ఇకపోతే అంతకుమించి అనే వేరొక చిన్న సినిమా రిలీజ్ బరిలో పోటీపడుతోంది. ఈ సినిమా పోస్టర్లలో యాంకర్ రష్మి రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేయడం చర్చకొచ్చింది. మొత్తానికి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా సత్తా ఎంత అన్నది నిరూపించుకోవాల్సి ఉంటుంది.

కోన చెప్పినట్టు… వివాదంతో ప్రచారం కోరుకుండా.. వివాదాలకు తావివ్వకుండానే ఇవన్నీ రిలీజవుతున్నాయి కాబట్టి ప్రచారం తక్కువే ఉంది. వివాదాలు కొనితెచ్చుకుని ప్రచారం కావాలనుకోలేదు కాబట్టి కంటెంట్లో దమ్ముందనే ఆశిద్దాం. అలా నిరూపించుకోవాలనే కోరుకుందాం. ఆల్ ది బెస్ట్.