బాండ్ 007పై ‘మీటూ’ చికాకులు!

0

ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమ ప్రభావం అసాధారణంగా పని చేస్తోందనడానికి ఇదిగో ఇదో పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ది గ్రేట్ జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో తెరకెక్కుతున్న 25వ సినిమా ఆన్ లొకేషన్ కండిషన్ల గురించి ఒక్కో నిజం ఆశ్చర్యపరుస్తున్నాయ్. అసలే బాండ్ 007 అంటేనే అదిరిపోయే శృంగారం తప్పనిసరి. అందాల భామలతో రోమాంచితమైన సన్నివేశాలకు కొదవే ఉండదు. ఓవైపు సాహసాలు.. మరోవైపు యాక్షన్ తో అదరగొడుతూనే భామామణులతో శృంగార కలాపాలు సాగించడం బాండ్ ప్రత్యేకత.

ఇప్పటివరకూ రిలీజైన 24 సినిమాల్లో రొమాన్స్ సీన్స్ ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈసారి కూడా 25వ చిత్రంలో శృంగారం కంటెంట్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈసారి కూడా వరుసగా మూడోసారి డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృంగార సన్నివేశాల్ని తెరకెక్కించేప్పుడు స్పాట్ లో ప్రత్యేకించి కొందరు కోచ్ లు ఉంటారట. కథానాయికల కదలికల్ని వీళ్లు గమనిస్తారు. వారికి అసౌకర్యంగా ఉండే ఏ సన్నివేశాన్ని అయినా వీళ్లతో యథేచ్ఛగా చెప్పుకోవచ్చు. తద్వారా అక్కడ ఇబ్బందుల్ని తొలగిస్తారట. ఆ మేరకు నిర్మాత బార్బరా బ్రకోలి బాండ్ యూనిట్ కి ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ జాగ్రత్తల్ని పరిశీలిస్తే.. మీటూ ఉద్యమ ప్రభావం హాలీవుడ్ పై మామూలుగా లేదని అర్థం చేసుకోవచ్చు. అసలే శృంగారం కేరాఫ్ హాలీవుడ్ అని భావించే చోట దానికి ఆస్కారమే లేకుండా ఇలా జాగ్రత్త పడడం చూస్తుంటే మీటూ ప్రభావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డేనియల్ క్రెయిగ్.. బాండ్ గర్ల్ అనా డీ ఆర్మ్స్తో సీన్స్ తీసేప్పుడు కోచ్ లు వారికి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవలే జమైకాలో జరిగిన షూటింగ్ లో డేనియల్ క్రెగ్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ అప్పటికి నిలిపి వేశారు. త్వరలో లండన్ లోని ప్రతిష్ఠాత్మక పైన్ వుడ్ స్టూడియోస్ లో తదుపరి షెడ్యూల్ ను చిత్రీకరించాల్సి ఉంది. గాయం కారణంగా ఆ చిత్రీకరణ భాగాన్ని రద్దు చేశారట. ఇక ఇలాంటి భారీ చిత్రాలు వేధింపుల పేరుతో వార్తలకెక్కితే వచ్చే చెడ్డ పేరు వల్ల మార్కెట్ పరమైన ఇబ్బందుల్ని ప్రొడక్షన్ హౌస్ లు ఎదుర్కోవాల్సి వస్తోంది. నటుల్ని మార్చి తిరిగి రీషూట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆ తలనొప్పుల్ని భరించలేకే 007బృందం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.