ఫిబ్రవరిలో నయన్ “సైరా” సెట్స్ కి

0nayanataraమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా వస్తోంది ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయింది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన పోరాట దృశ్యాలను తెరకెక్కించారు.

ఇక రెండో షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరు, నయన్‌లపై ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. అయితే నయన్‌కి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ మెగా ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుందంటూ ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. ముందుగా డేట్స్ ఇచ్చినట్లుగానే ఫిబ్రవరిలో నయన్ సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉందట. దీంతో ఫిబ్రవరి నెలలో చిరు, నయన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు అంతా సిద్ధం చేస్తోందట చిత్రయూనిట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రాక కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిని కూడా అతిత్వరలో కన్ఫార్మ్ చేయనున్నారు.