రజని ‘ కుక్క ‘ కు భారీ డిమాండ్..

0సాధారణం గా రజని సినిమాలకు మాత్రమే భారీ డిమాండ్ ఉంటుందని నిన్నటి వరకు విన్నాం..కానీ ఇప్పుడు ఆయన సినిమాలో నటించిన కుక్కకు కూడా భారీ డిమాండ్ వస్తుందని ఇప్పుడే చూస్తున్నాం..వింటున్నాం. ప్రస్తుతం రజనీకాంత్ , పా. రంజిత్ దర్శకత్వం లో కాలా అనే సినిమా చేస్తున్నాడు. హీరో ధనుష్ స్వయం గా ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఏప్రిల్ 27 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ లో మణి అనే కుక్క రజనితో దాదాపు 30 రోజులు నటించిందట. ఈ కుక్క అంటే రజనికి బాగా ఇష్టమట. దానికోసం ప్రత్యేకమైన బిస్కెట్స్ తీసుకొచ్చారట.. మ‌ణి చెన్నైలోని రోడ్ పైన త‌న‌కి దొరికిందని చెప్పిన సిమ‌న్ దీనిని అమ్మేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం కుక్క వ‌య‌స్సు రెండు సంవ‌త్స‌రాల ఆరు నెల‌లు కాగా, ప‌లు సినిమాల‌లో న‌టించింది.