పవన్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు

0జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’పై తీవ్ర విమర్శలు చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్. ఇటీవల వ్యతిగత విమర్శల దాడి విషయంలో పవన్ మీడియాని నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ ఏపీసోడ్’లో పవన్ అభిమానులు మీడియాపై దాడి కూడా చేశారు. ఇప్పుడిదే విషయాన్ని ఎంపీ గల్లా ప్రస్తావించారు.

“పవన్ కల్యాణ్ గారూ… మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ, మీరు మీడియాపై దాడికి దిగారు. మీ అభిమానులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తప్పుడు భాష వాడుతున్నారు. శరీరాకృతిపై మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ మౌనం పరోక్షంగా దీనిని మీరు అంగీకరిస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీరు మీ అభిమానులని కంట్రోల్ చేయలేకపోతున్నారు” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. మరీ.. గల్లా ట్విట్ కు పవన్ రీ-ట్విట్ చేస్తారేమో.. ! చూడాలి.