మాజీ భర్త మాటకు గౌతమి కౌంటర్

0gauthami-comments-on-rajiniకొన్ని సందర్భాల్లో చాలా చిత్రంగా ఉంటాయి. విషయాల మీద స్వతంత్ర భావాలున్న వారి మధ్య సంవాదం సహజమే. అయితే.. ఒకప్పుడు భార్యభర్తలుగా ఉండి.. కాల ప్రవాహంలో వేరుపడిన ఇద్దరు ఇప్పుడో విషయం మీద తప్పులు ఎత్తి చూపించుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మలయాళ నటిని కిడ్నాప్ చేయటం.. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఉదంతం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను అరెస్ట్ చేయటం లాంటి సంచలన పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. విశ్వ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాధితురాలి పేరును దాచకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. మాజీ భర్త కమల్ చేసిన వ్యాఖ్యపై గౌతమి తీవ్రంగా స్పందించారు. బాధితురాలి పేరు దాచొద్దంటూ కమల్ చేసిన వ్యాఖ్యను ఆమె తప్పు పట్టారు.

తనకు బాధితురాలన్న పదం వాడటానికి కూడా సిగ్గుగా ఉందన్నారు. ఓ అమ్మాయి ఇలాంటి దారుణ ఘటనల్ని ఎదుర్కొని తనకు న్యాయం కావాలని పోరాడుతున్నప్పుడు ఆమె పేరును దాచాల్సిన అవసరం లేదన్నారు. తన దృష్టిలో ఆమె ఒక హీరో అని.. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని.. తన చుట్టూ ఉన్న వారికి ముఖం చూపించాలన్నారు.

తనను అంత దారుణంగా వ్యవహరించిన వారికి కూడా ఆమె తన ముఖాన్ని చూపించాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తం చేసిన గౌతమి.. అలాంటి వాటికి ఎదుర్కొవటానికి చాలా ధైర్యం కావాలన్నారు. మొత్తానికి తన మాజీ భర్త చేసిన వ్యాఖ్యలోనూ తప్పును చూపించిన గౌతమి మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.