ఖైదీ, శాతకర్ణి ఓవర్సీస్ వసూళ్లు!

0khaidi-and-Gautamiputra-satakarniమెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. రెండు చిత్రాలు ఊహించని విధంగా వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ వసూళ్లు చూస్తుంటే.. ట్రేడ్ జనాలకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

ఇప్పటికే ఖైదీ 2.1 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. శాతకర్ణి 1.2 మిలియన్ డాలర్లను రాబట్టింది. అయితే.. ఈ సినిమాల బ్రేక్ ఈవెన్ పై ఓ అవగాహన తెచ్చుకోవాలంటే.. ట్రేడ్ లెక్కలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఖైదీ నంబర్ 150ని ఓవర్సీస్ లో 12 కోట్లకు విక్రయించారు. ఇందులో 2 కోట్ల రిఫండబుల్ అమౌంట్ కూడా ఉంటుంది. అంటే.. ఆ మొత్తాన్ని చిరు మూవీ రాబట్టలేకపోతే.. 2 కోట్లు రిఫండ్ చేయాల్సి ఉంటుందన్న మాట.

రెస్టాఫ్ ది వరల్డ్ హక్కులను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ 2.5 కోట్లకు విక్రయించాడు. అంటే.. కేవలం యూఎస్ నుంచే 9.5 కోట్లు రికవర్ కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ యూఎస్ లో 14.32 కోట్ల గ్రాస్ రాగా.. ఇందులో 7.9కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంటుంది. అంటే.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖైదీ ఇంకా 1.6 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందన్న మాట. ఒకవేళ రాకపోతే.. అగ్రిమెంట్ ప్రకారం నిర్మాత నుంచి రిఫండ్ అందుకుంటాడు కాబట్టి.. ఖైదీ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే.

ఇక గౌతమిపుత్ర శాతకర్ణి విషయానికి వస్తే ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను 5 కోట్లకు విక్రయించారు. ఇప్పటికే ఈ చిత్రానికి 8.32 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో 4.6 కోట్ల షేర్ కాగా.. రెస్టాఫ్ ది వరల్డ్ రైట్స్ అమ్మడం ద్వారా 90 లక్షలు డిస్ట్రిబ్యూటర్ కి వచ్చాయి. అంటే.. శాతకర్ణి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే 50 లక్షల లాభం గడించాడన్న మాట.

అమెరికా టూర్ ప్లాన్ వెనక కూడా.. ఈ చిత్రాన్ని 2 మిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యం ఉందని అంటున్నారు. మరోవైపు.. ఖైదీ నంబర్ 150 కూడా మరో పది రోజుల పాటు స్టడీగా కలెక్షన్స్ రాబడితే.. 3 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.