గౌతమీపుత్ర శాతకర్ణి విజువల్స్ కాపీనా?

0gautamiputra-satakarni-newనందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్‌ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను వాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ వాడుకునేందుకు ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట. గతంలో సంజయ్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో క్రిష్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ అనుబంధం తోనే గ్రాఫిక్స్ విషయంలో సంజయ్ సాయం చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ ప్రచారాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కొట్టి పారేస్తోంది. ట్రైలర్లో కనిపించిన విజువల్స్ అన్ని ఈ సినిమా కోసం స్పెషల్‌గా క్రియేట్ చేసినవే గాని.., కాపీ చేసినవి కాదని తేల్చి చెపుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తున్న., ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కీలక పాత్రలో నటిస్తోంది.