మొరాకో సెట్‌లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

0Balayya-Gautami-putra-satakarniనందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్‌ మొరాకోలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర దర్శకుడు క్రిష్‌ సోషల్‌మీడియా ద్వారా షూటింగ్‌ సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో చిత్ర బృందం అంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడు రోజులుగా షూటింగ్‌ జరుగుతోందని, యూనిట్‌ మొత్తం కష్టపడి పనిచేస్తోందని క్రిష్‌ తెలిపారు. మొరాకో, ఇండియన్‌ ఫుడ్‌ మిక్స్‌ చాలా నచ్చిందని పోస్ట్‌ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను మొరాకోలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.Gautami-putra-satakarni-morocco