‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లైవ్ అప్డేట్స్ తెలుగు వెర్షన్

0GPSK-Live-updates‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లైవ్ అప్డేట్స్ తెలుగు వెర్షన్

Gautamiputra Satakarni Review Live Updates in english

 • క్రిష్ వాయిస్ ఓవర్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూనే ఉండండి.

 • శాతకర్ణి యుద్ధం గెలవడంతో సినిమా క్లైమాక్స్‌కు వచ్చింది.

 • డెమొట్రిస్, శాతకర్ణిలకు మధ్యన ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది.

 • యుద్ధం రెండో రోజు నడుస్తోంది. కథలో షాకింగ్ ట్విస్ట్ వచ్చింది.

 • ప్రస్తుతం సింగముపై లంఘించెను అంటూ చివరి పాట వస్తోంది.

 • సినిమా ఓ స్పస్పెన్స్ ఎలిమెంట్‌తో నడుస్తోంది.

 • మొదటిరోజు యుద్ధం ముగిసింది. శాతకర్ణి అన్నీ తానై యుద్ధం గెలుస్తున్నాడు.

 • ప్రస్తుతం మూడో యుద్ధం నడుస్తోంది. యుద్ధ సన్నివేశాలు బాగున్నాయి.

 • ప్రస్తుతం గణ గణ అంటూ ఓ పాట వస్తోంది. మ్యూజిక్, డ్యాన్స్ కంపోజిషన్ బాగున్నాయి.

 • తన సైనికులకు బాలకృష్ణ ఓ బలమైన సందేశం ఇస్తున్నాడు.

 • ప్రస్తుతం సాహో సార్వభౌమ సాహో అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సాంగ్ వస్తోంది.

 • ఓ గ్రీకు రాజుతో తలపడేందుకు శాతకర్ణి బయలుదేరుతున్నాడు.

 • శ్రియ, బాలయ్యల మధ్యన ప్రస్తుతం ఓ ఎమోషనల్ సీన్ నడుస్తోంది.

 • శాతకర్ణి మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు.

 • ప్రస్తుతం మృగనయన అంటూ ఓ పాట వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి. శ్రియ అప్పియరన్స్ కూడా చాలా బాగుంది.

 • కథలో ఇప్పుడు ఓ ఆసక్తికర ట్విస్ట్ వచ్చి చేరింది.

 • ప్రస్తుతం తల్లి గొప్పదనాన్ని చెబుతూ ఓ అద్భుతమైన సన్నివేశం వస్తోంది. శాతకర్ణి తన పేరును గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నాడు.

 • మళ్ళీ అమరావతికి తిరిగి రాగానే శాతకర్ణి రాజసూయయాగం మొదలుపెట్టాడు.

 • ఇంటర్వెల్ తర్వాత భరత ఖండానికే రాజుగా శాతకర్ణి నిలిచాడు.

 • ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకూ సినిమా చాలా బాగుంది. శాతకర్ణిగా బాలయ్య నటన, యుద్ధ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

 • మొత్తం భారతాన్నే శాతకర్ణి గెలిచాడు. ఇంటర్వెల్.

 • యుద్ధం ఇప్పుడే ముగిసింది. అద్భుతంగా ఉన్న విజువల్స్‌తో యుద్ధం మొత్తం ఆకట్టుకుంది.

 • కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తుండగా, శాతకర్ణి నహాపన కోటలోకి ప్రవేశించాడు.

 • తరువాతి రోజు యుద్ధంలో భీకర పోరాట సన్నివేశాలు నడుస్తున్నాయి.

 • మొదటిరోజు యుద్ధం ముగిసింది. శాతకర్ణి సైనికులు ఓటమి భయంలో ఉన్నారు.

 • ప్రస్తుతం తెలుగు జాతి గొప్పదనం గురించి ఓ భారీ డైలాగ్ వస్తోంది. బాలకృష్ణ తన స్టైల్లో డైలాగ్ చెప్పేస్తున్నారు.

 • ప్రస్తుతం మరో యుద్ధ సన్నివేశం వస్తోంది. గ్రీకు రాజు నహాపనతో శాతకర్ణి తలపడుతున్నాడు.

 • బాలకృష్ణ తన కుమారుడు పుల్లోమవిని యుద్ధానికి తీసుకెళుతున్నాడు.

 • బుర్రకథలో ఇప్పుడే ఓ ట్విస్ట్ వచ్చి చేరింది.

 • బాలయ్య ఈ బుర్రకథకు మారువేశంలో వచ్చాడు.

 • కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ బుర్రకథలా శాతకర్ణి జీవితం గురించి చెప్పే సన్నివేశం వస్తోంది.

 • ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ఏకిమీడా వస్తోంది. బాలకృష్ణ, శ్రియల మధ్యన వస్తోన్న ఈ రొమాంటిక్ నంబర్ విజువల్స్ బాగానే ఉన్నాయి.

 • శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా శ్రియ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.

 • శాతకర్ణి గెలుపుతో యుద్ధం ఇప్పుడే ముగిసింది.

 • ప్రస్తుతం ఓ యుద్ధ సన్నివేశం వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి.

 • బాలకృష్ణ ఇప్పుడే శతకర్ణిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

 • తనికెళ్ళ భరణి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

 • ఓ పెద్ద పడవ మునిగిపోయే నేపథ్యంలో సన్నివేశం వస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో బాలయ్య వాయిస్ ఓవర్ ఇప్పుడే మొదలైంది.

 • లేడీ వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలైంది. టైటిల్స్ పడుతున్నాయి.

 • హాయ్ సినిమా ఇప్పుడే మొదలైంది.