గౌతమ్ నంద ట్రైలర్ టాక్: ఎంత రిచ్చో!!

0మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ గౌతమ్ నంద విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ గత చిత్రం ఆరగడుగుల బుల్లెట్.. రిలీజ్ డేట్ ఇచ్చాక ఆఖరి క్షణంలో విడుదల ఆగిపోవడంతో.. తర్వాతి సినిమాల బిజినెస్ పై కొందరు అనుమానించారు కానీ.. గౌతమ్ నందకు అలాంటి సమస్యలేవీ పెద్దగా ఎదురుకాలేదు.

టీజర్ తోనే ఆకట్టుకున్న గౌతమ్ నందకు.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఎన్నో ఆకర్షణలు ఉన్నా.. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గురించే. ట్రైలర్ లో కనిపించిన ప్రతీ సన్నివేశంలోను.. సినిమాపై పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఇంతటి అల్ట్రామోడర్న్ రిచ్ నెస్ ను ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఆవిష్కరించలేదని చెప్పచ్చు. దర్శకుడు సంపత్ నందిపై.. నిర్మాతలు జె భగవాన్.. పుల్లారావులు ఏ స్థాయిలో నమ్మకం ఉంచారో తెలుస్తోంది. డబ్బుతో లింక్ అయి ఉండే స్టోరీలో గోపీచంద్ రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

క్లాస్ లుక్ లోను.. మాస్ లుక్ లోను రెండు రకాలుగా గోపీచంద్ సూపర్బ్ గా ఉన్నాడు. హీరోయిన్ హన్సిక మొత్వాని కూడా తన వంతుగా బోలెడన్ని అందాలు కురిపించింది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. దుబాయ్ అందాలను ఏరియల్ షాట్స్ ద్వారా చూపించిన సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ.. మూవీకి స్పెషల్ అసెట్స్. డైలాగ్స్ నుంచి.. పిక్చరైజేషన్ వరకు.. సంపత్ నంది మార్క్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పచ్చు.