సినిమాటో గ్రాఫర్‌ తో హీరోయిన్ పెళ్లి

0పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్ గాయత్రి కృష్ణన్ ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. తిరువనంతపురానికి చెందిన గాయత్రి కృష్ణన్‌ సినిమాటో గ్రాఫర్‌ జీవన్‌రాజ్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల రెండో తేదీన వీరి నిశ్చితార్థం గోప్యంగా జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది.

దీనిపై గాయత్రి మాట్లాడుతూ.. మాది ప్రేమ పెళ్లే అయినా తల్లిదండ్రుల సమ్మతంతోనే వివాహం చేసుకొంటున్నాం. పెళ్లి తర్వాత కూడా తప్పకుండా నటిస్తా. చిత్ర పరిశ్రమలో మేమిద్దరం సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయని ” చెప్పుకొచ్చారు.