“గాయత్రీ” రివ్యూ

0gayatri-reviewసినిమా పేరు: గాయత్రి

నటీనటులు: మోహన్‌బాబు.. విష్ణు.. శ్రియ.. నిఖిలా విమల్.. అనసూయ భరద్వాజ్‌ తదితరులు

రచయిత: డైమండ్‌ రత్న బాబు

సినిమాటోగ్రాఫర్‌: సర్వేష్ మురారి

సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌

నిర్మాత: మోహన్‌బాబు

దర్శకత్వం: ఆర్.ఆర్‌ మదన్

మోహ‌న్‌బాబు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క‌థానాయ‌కుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఆయ‌న పోషించిన‌న్ని పాత్ర‌లు మరే న‌టుడూ చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో! ఒక్క ముక్క‌లో చెప్పాలంటే న‌టనకు ఆయ‌న‌ ఒక నిఘంటువు. ఏ డైలాగ్‌ను ఎలా ప‌ల‌కాలో ఎక్క‌డ పెంచాలో.. ఎక్క‌డ తుంచాలో తెలిసిన అతికొద్దిమంది న‌టుల్లో మోహ‌న్‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. చాలా రోజుల త‌ర్వాత ఓ పూర్తిస్థాయి పాత్ర‌లో ఆయ‌న న‌టించిన చిత్రం గాయ‌త్రి. మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ముఖ్యంగా మోహ‌న్‌బాబు ఈజ్ బ్యాక్ అనేలా ఉన్నాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను గాయ‌త్రి అందుకుందా? రెండు పాత్ర‌ల్లో మోహ‌న్‌బాబు న‌ట విశ్వ‌రూపాన్ని మ‌ద‌న్ వెండితెర‌పై ఎలా చూపించారు?

కథేంటంటే: దాసరి శివాజీ(మోహన్‌బాబు) ఒక స్టేజ్‌ ఆర్టిస్ట్‌. శారదాసదన్‌ అనే అనాథాశ్రమాన్ని నడుపుతుంటాడు. డబ్బు కోసం మారువేషం వేసుకుని న్యాయస్థానంలో శిక్ష పడిన వారి స్థానాల్లోకి వెళుతుంటాడు. అలా డబ్బు సంపాదిస్తుంటాడు. అతని కూతురు గాయత్రి (నిఖిలా విమల్‌) చిన్నప్పుడే తప్పిపోతుంది. పాతికేళ్లుగా ఆమె కోసం వెతుకుంటాడు. చివరికి ఆమె జాడ తెలుస్తుంది. ఇద్దరూ కలవబోతున్నారనగా గాయత్రి పటేల్‌(మోహన్‌బాబు).. శివాజీని కిడ్నాప్‌ చేస్తాడు. గాయత్రి పటేల్‌.. శివాజీని ఎందుకు కిడ్నాప్‌ చేయాల్సి వచ్చింది? శివాజీ గతం ఏంటి? తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిశారా? లేదా? అన్నదే కథ.

ఎలా ఉందంటే: తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పుడే తప్పిపోయిన తన కూతురిని అన్వేషిస్తూ ఓ తండ్రి సాగించిన ప్రయాణం ఇది. కథగా చెప్పుకుంటే సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నా, తగినన్ని కమర్షియల్‌ అంశాలు కూడా జోడించారు. ఫైట్లు, పాటలతో వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. తొలి సగంలో కథ పెద్దగా ఉండదు. ఆయా పాత్రలను పరిచయం చేయడంతోనే ప్రథమార్ధం పూర్తవుతుంది. ద్వితీయార్ధం ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. శివాజీ(విష్ణు) అతని భార్య శారద(శ్రియ) మధ్య పరిచయం, వారి ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించారు. మోహన్‌బాబు పాత్రలో విష్ణు కన్పించడం మంచు అభిమానులకు నచ్చుతుంది. ఒక రకంగా మంచి ప్రయత్నం ఇది. గాయత్రి పటేల్‌ రాకతో కథ రసవత్తరంగా మారుతుంది. నిజానికి ఈ కథలో మలుపులు గాయత్రి పటేల్‌ రాకతోనే మొదలవుతాయి. చివరి 40 నిమిషాలు పట్టు సడలకుండా తెరకెక్కించారు. కథలో మలుపులు, ఉత్కంఠ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఒక విధంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్సే ఈ సినిమాను నిలబెట్టాయి. మధ్యమధ్యలో మోహన్‌బాబు పలికిన పొలిటికల్‌ డైలాగులు, నాయకులపై వేసిన సెటైర్లు చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. ప్రత్యేక హోదాపై కూడా ఒక డైలాగ్‌ వదిలారు. కాకపోతే అది కాస్తా బీప్‌గా సెన్సార్‌ కత్తెరకు చిక్కుకుంది.

ఎవరెలా చేశారంటే: మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. శివాజీగా, గాయత్రి పటేల్‌గా రెండు పార్శ్వాలను చూపించారు. శివాజీ కంటే గాయత్రి పటేల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. తనదైన డైలాగ్‌ డిక్షన్‌తో ఆకట్టుకున్నారు. విష్ణు కన్పించింది కాసేపే. అయినా అతని నటన ఆకట్టుకుంటుంది. శ్రియది అతిథి పాత్ర అనుకోవచ్చు. అయితే ఆమె ఉన్నంతసేపూ భావోద్వేగాలు పండాయి. గాయత్రిగా నిఖిలా విమల్‌, శ్రేష్ఠగా అనసూయ ఆకట్టుకుంటారు. తమన్‌ పాటలు బాగున్నాయి. ‘వేకువమ్మా..వేకువమ్మా రావే’, ‘ఒక నువ్వు ఒక నేను’ పాటలు మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. డైమండ్‌ రత్నబాబు అందించిన సంభాషణలు అదనపు బలం. సర్వేష్‌ మురారి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కథలో ఒక కొత్త పాయింట్‌ ఉంది. దర్శకుడు దాన్ని తండ్రీకూతుళ్ల అనుబంధం మేళవించి కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు.

బలాలు

+ గాయత్రి పటేల్ పొలిటికల్‌ పంచ్‌లు‌

+ రెండు పాటలు

+ ద్వితీయార్ధం

బలహీనతలు

-నెమ్మదిగా సాగిన ప్రథమార్ధం

– వినోదం లేకపోవడం

చివరిగా: ఇది ‘గాయత్రి’ పటేల్‌ మేజిక్‌‌!

సినిమా పేరు: గాయత్రి నటీనటులు: మోహన్‌బాబు.. విష్ణు.. శ్రియ.. నిఖిలా విమల్.. అనసూయ భరద్వాజ్‌ తదితరులు రచయిత: డైమండ్‌ రత్న బాబు సినిమాటోగ్రాఫర్‌: సర్వేష్ మురారి సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌ నిర్మాత: మోహన్‌బాబు దర్శకత్వం: ఆర్.ఆర్‌ మదన్ మోహ‌న్‌బాబు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క‌థానాయ‌కుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఆయ‌న పోషించిన‌న్ని పాత్ర‌లు మరే న‌టుడూ చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో! ఒక్క ముక్క‌లో చెప్పాలంటే న‌టనకు ఆయ‌న‌ ఒక నిఘంటువు. ఏ డైలాగ్‌ను ఎలా ప‌ల‌కాలో ఎక్క‌డ పెంచాలో.. ఎక్క‌డ తుంచాలో తెలిసిన అతికొద్దిమంది న‌టుల్లో మోహ‌న్‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. చాలా రోజుల త‌ర్వాత ఓ పూర్తిస్థాయి పాత్ర‌లో ఆయ‌న న‌టించిన చిత్రం గాయ‌త్రి. మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ముఖ్యంగా మోహ‌న్‌బాబు ఈజ్ బ్యాక్ అనేలా ఉన్నాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను గాయ‌త్రి అందుకుందా? రెండు పాత్ర‌ల్లో మోహ‌న్‌బాబు న‌ట విశ్వ‌రూపాన్ని మ‌ద‌న్ వెండితెర‌పై ఎలా చూపించారు? కథేంటంటే: దాసరి శివాజీ(మోహన్‌బాబు) ఒక స్టేజ్‌ ఆర్టిస్ట్‌. శారదాసదన్‌ అనే అనాథాశ్రమాన్ని నడుపుతుంటాడు. డబ్బు కోసం మారువేషం వేసుకుని న్యాయస్థానంలో శిక్ష పడిన వారి స్థానాల్లోకి వెళుతుంటాడు. అలా డబ్బు సంపాదిస్తుంటాడు. అతని కూతురు గాయత్రి (నిఖిలా విమల్‌) చిన్నప్పుడే తప్పిపోతుంది. పాతికేళ్లుగా ఆమె కోసం వెతుకుంటాడు. చివరికి ఆమె జాడ తెలుస్తుంది. ఇద్దరూ కలవబోతున్నారనగా గాయత్రి పటేల్‌(మోహన్‌బాబు).. శివాజీని కిడ్నాప్‌ చేస్తాడు. గాయత్రి పటేల్‌.. శివాజీని ఎందుకు కిడ్నాప్‌ చేయాల్సి వచ్చింది? శివాజీ గతం ఏంటి? తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిశారా? లేదా? అన్నదే కథ. ఎలా ఉందంటే: తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పుడే తప్పిపోయిన తన కూతురిని అన్వేషిస్తూ ఓ తండ్రి సాగించిన ప్రయాణం ఇది. కథగా చెప్పుకుంటే సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నా, తగినన్ని కమర్షియల్‌ అంశాలు కూడా జోడించారు. ఫైట్లు, పాటలతో వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. తొలి సగంలో కథ పెద్దగా ఉండదు. ఆయా పాత్రలను పరిచయం చేయడంతోనే ప్రథమార్ధం పూర్తవుతుంది. ద్వితీయార్ధం ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. శివాజీ(విష్ణు) అతని భార్య శారద(శ్రియ) మధ్య పరిచయం, వారి ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించారు. మోహన్‌బాబు పాత్రలో విష్ణు కన్పించడం మంచు అభిమానులకు నచ్చుతుంది. ఒక రకంగా మంచి ప్రయత్నం ఇది. గాయత్రి పటేల్‌ రాకతో కథ రసవత్తరంగా మారుతుంది. నిజానికి ఈ కథలో మలుపులు గాయత్రి పటేల్‌ రాకతోనే మొదలవుతాయి. చివరి 40 నిమిషాలు పట్టు సడలకుండా తెరకెక్కించారు. కథలో మలుపులు, ఉత్కంఠ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఒక విధంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్సే ఈ సినిమాను నిలబెట్టాయి. మధ్యమధ్యలో మోహన్‌బాబు పలికిన పొలిటికల్‌ డైలాగులు, నాయకులపై వేసిన సెటైర్లు చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. ప్రత్యేక హోదాపై కూడా ఒక డైలాగ్‌ వదిలారు. కాకపోతే అది కాస్తా బీప్‌గా సెన్సార్‌ కత్తెరకు చిక్కుకుంది. ఎవరెలా చేశారంటే: మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. శివాజీగా, గాయత్రి పటేల్‌గా రెండు పార్శ్వాలను చూపించారు. శివాజీ కంటే గాయత్రి పటేల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. తనదైన డైలాగ్‌ డిక్షన్‌తో ఆకట్టుకున్నారు. విష్ణు కన్పించింది కాసేపే. అయినా అతని నటన ఆకట్టుకుంటుంది. శ్రియది అతిథి పాత్ర అనుకోవచ్చు. అయితే ఆమె ఉన్నంతసేపూ భావోద్వేగాలు పండాయి. గాయత్రిగా నిఖిలా విమల్‌, శ్రేష్ఠగా అనసూయ ఆకట్టుకుంటారు. తమన్‌ పాటలు బాగున్నాయి. ‘వేకువమ్మా..వేకువమ్మా రావే’, ‘ఒక నువ్వు ఒక నేను’ పాటలు మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. డైమండ్‌ రత్నబాబు అందించిన సంభాషణలు అదనపు బలం. సర్వేష్‌ మురారి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కథలో ఒక కొత్త పాయింట్‌ ఉంది. దర్శకుడు దాన్ని తండ్రీకూతుళ్ల అనుబంధం మేళవించి కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. బలాలు + గాయత్రి పటేల్ పొలిటికల్‌ పంచ్‌లు‌ + రెండు పాటలు + ద్వితీయార్ధం బలహీనతలు -నెమ్మదిగా సాగిన ప్రథమార్ధం - వినోదం లేకపోవడం చివరిగా: ఇది ‘గాయత్రి’ పటేల్‌ మేజిక్‌‌!

"గాయత్రీ" రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3
సాంకేతికవిభాగం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.6

"గాయత్రీ" రివ్యూ

"గాయత్రీ" రివ్యూ

User Rating: 2.45 ( 1 votes)
3