గీతతో అక్కినేని బ్రదర్స్ కు లక్ కలిసి వచ్చేనా?

0

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ లు సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద చిన్నపాటి యుద్దమే చేస్తున్నారు. చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే వస్తోంది. ముఖ్యంగా అఖిల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పర్చాయి. స్టార్ హీరోల స్థాయిలో అఖిల్ నిలుస్తాడని అక్కినేని ఫ్యాన్స్ భావించారు. కాని వరుసగా మూడు ఫ్లాప్ లతో అఖిల్ పరిస్థితి స్టార్ హోదా సంగతి పక్కన పెడితే సక్సెస్ కావాలి అన్నట్లుగా ఉంది. అఖిల్ నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దాదాపుగా ఖరారు అయ్యింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఒక సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అఖిల్ కు తగ్గట్లుగా ఉండే ఒక స్క్రిప్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తయారు చేయడం జరిగిందని త్వరలోనే మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మెగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. అందుకే అఖిల్ నాల్గవ సినిమాతో సక్సెస్ కొట్టడం ఖాయం అంటున్నారు. అల్లు అరవింద్ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇదే సమయంలో అక్కినేని మరో బ్రదర్ నాగచైతన్య కూడా గీతాఆర్ట్స్ లో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘గీత గోవిందం’ చిత్ర దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీని నిర్మించేందుకు గీతాఆర్ట్స్ ఏర్పాట్లు చేస్తోంది. పరశురామ్ ఒక చక్కని రొమాంటిక్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్దం చేశాడని ఆ స్క్రిప్ట్ కు చైతూ అయితే బాగుంటుందని అల్లు అరవింద్ భావించాడట. అలా అక్కినేని బ్రదర్స్ తో ఒకే సారి అల్లు అరవింద్ సినిమాలు నిర్మించబోతున్నాడు. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ సంస్థ అక్కినేని బ్రదర్స్ కు కావాల్సిన సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer