గీత గోవిందం.. వాట్ ఎ పోస్టర్

0గీత గోవిందం.. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీని ప్రోమోలు భలే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి మొదట్నుంచి. ‘అర్జున్ రెడ్డి’తో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించడమే ఈ చిత్రానికి అతి పెద్ద ఆకర్షణ. అతడి సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందాన్నా భలేగా కుదిరింది. వీళ్ల జోడీ భలేగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేస్తున్న ప్రతి పోస్టర్ అట్రాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ గురించి వెల్లడిస్తూ ఒక పోస్టర్ వదిలారు. అందులో విజయ్ లుంగీ కట్టుకుని సగటు కుర్రాడిలా ఉన్నాడు. హీరోయిన్ రష్మిక విజయ్ వీపు ఎక్కేసి అతడితో సయ్యాటలు ఆడుతోంది. చాలా సహజంగా.. అందంగా ఉన్న ఈ పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.

ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ నెల 22న ఉదయం 11.05 నిమిషాలకు టీజర్ లాంచ్ చేయబోతున్నారట. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ అంటూ ఒక పాట లాంచ్ చేశారు. అది ఇన్స్టంట్ హిట్టయింది. వారం తిరక్కుండానే కోటి వ్యూస్ పూర్తి చేసుకుంది. గీతా ఆర్ట్స్-2 బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ నిర్మాత. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన పరశురామ్.. మళ్లీ అదే బేనర్లో బయటి హీరోతో సినిమా చేశాడు. ఇదే బేనర్లో విజయ్ చేసిన ‘ట్యాక్సీవాలా’ను పక్కన పెట్టి ముందు ‘గీత గోవిందం’ను రిలీజ్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ నుంచి రాబోయే సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.