ఖైది కి అడుగు దూరంలో గోవిందం

0విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అంచనాలకు మించిన కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసిన ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సత్తా చాటింది. ఇప్పటికే 2.1 మిలియన్ డాలర్స్ తో ఓవర్సీస్ లో టాప్-10 హైయెస్ట్ గ్రాసింగ్ లిస్టు తొమ్మిదవ స్థానంలో ఉంది.

ఇక తాజా సమాచారం ప్రకారం.. అంటే శనివారం రాత్రివరకూ $ 2429061($2.42 మిలియన్) గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. టాప్-10 లిస్టు లో 8 వ స్థానం లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఖైది నెంబర్ 150′($2.447 మిలియన్) కంటే $22K మాత్రమే తక్కువ. మరోవైపు ఏడవ స్థానంలో ఉన్న ‘అ ఆ’ ($2.449 మిలియన్) కలెక్షన్స్ కు ‘ఖైది నెంబర్ 150’ పెద్దగా తేడా లేదు. దీంతో గోవిందం మరో 22 వేల డాలర్ల కలెక్షన్ సాధించగలిగితే చిరంజీవి సినిమాను మాత్రమే కాకుండా త్రివిక్రమ్-నితిన్ ‘అ ఆ’ ను కూడా దాటి ఏడవ స్థానం సాధిస్తుంది. మరి గోవిందం ఆ ఫీట్ కూడా సాధించి సంచలనం సృష్టిస్తాడా లేదా అన్న విషయం వేచి చూడాలి.

ఇక టాప్-10 లో ఉన్న ఉన్న సినిమాల లిస్టు ను ఒక సారి పరిశీలించండి.

1. బాహుబలి: ది కంక్లూజన్
2. బాహుబలి: ది బిగినింగ్
3. రంగస్థలం
4. భరత్ అనే నేను
5. శ్రీమంతుడు
6. మహానటి
7. అ ఆ
8. ఖైది నెంబర్ 15౦
9. గీత గోవిందం
10. ఫిదా