అమెరికాలో మోత మోగిస్తున్న గోవిందం!

0సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విజయ్ దేవరకొండ 100 సినిమాలు చేస్తాడు అని చెప్పిన మాట నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘గీత గోవిందం’ పైరసీ బారిన పడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ సినిమా ఫస్ట్ డే రెస్పాన్స్ మాత్రం కేకో కేక. ముఖ్యంగా అమెరికాలో గోవిందం డాలర్ల పంట పండిస్తున్నాడు. ఓపెనింగ్ వీకెండ్ లో 1 మిలియన్ డాలర్ల మార్కు ఈజీగా దాటేస్తాడని ట్రేడ్ వర్గాల అంచనా.

అమెరికా లో 146 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా మాత్రమే $400K గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాటు విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఇదొక నిదర్శనం. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రకారం ఇది ఈ ఏడాది నాలుగో బెస్ట్ ఓపెనర్. ‘అజ్ఞాతవాసి’ – ‘రంగస్థలం’ – ‘భరత్ అనే నేను’ ల తర్వాత స్థానంలో ఉంది. మరో వైపు ఈ కలెక్షన్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అయిన ‘S/o సత్యమూర్తి’ ($347K ) ను విజయ్ ‘గీత గోవిందం’ దాటేసింది.

విజయ్ కు ఆల్రెడీ ‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో ఓవర్సీస్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ‘గీత గోవిందం’ ప్రీమియర్స్ – ఫస్ట్ డే రెస్పాన్స్ చూస్తుంటే టాలీవుడ్ ‘రౌడి’ బాక్స్ ఆఫీస్ రికార్డుల మీద కూడా పడ్డట్టుగా ఉంది.