ఓవర్సీస్: గోవిందం సాధించాడబ్బా..!

0విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ బాక్స్ ఆఫీస్ హంగామా ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యంగా అమెరికాలో ఇంకా ఈ సినిమా జోరు తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే US బాక్స్ ఆఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్-10 చిత్రాల లిస్టులో 9 వ స్థానంలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. తాజా సమాచారం మేరకు 8 వ స్థానంలో ఉన్న మెగాస్టార్ రీ-ఎంట్రీ సినిమా ‘ఖైది నంబర్ 150’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటి 8వ స్థానం లో నిలిచింది.

‘ఖైది నంబర్ 150’ కలెక్షన్స్ $2447043 కాగా ‘గీత గోవిందం’ కలెక్షన్లు ఇప్పుడు $2447281. మరోవైపు ఏడవ స్థానం లో లో ఉన్న త్రివిక్రమ్- నితిన్ సినిమా ‘అ ఆ’ ఫుల్ రన్ కలెక్షన్స్ $2449174. రెండూ సినిమాలకు పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ గ్యాప్ ను కవర్ చేయడానికి పెద్దగా సమయం పట్టదు. ‘గీత గోవిందం’ కలెక్షన్స్ లో మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే మిగతా స్టార్ హీరోల సినిమాలన్నీ $18.. $20 టికెట్ రేట్లతో భారీ కలెక్షన్స్ సాధిస్తే ‘గీత గోవిందం’ మాత్రం జస్ట్ $12 టికెట్ రేట్ తో నే ఫీట్ సాధించింది.

ఇక అమెరికా టాప్-10 లిస్టు లో ఉన్న టాలీవుడ్ సినిమాలపై ఒక లుక్కేయండి.

1. బాహుబలి: ద కంక్లూజన్ – $20117274
2. బాహుబలి: ద బిగినింగ్ – $6999312
3. రంగస్థలం – $3513450
4. భరత్ అనే నేను – $3416451
5. శ్రీమంతుడు – $2890786
6. మహానటి – $2543515
7. అ ఆ – $2449174
8. గీత గోవిందం – $2447281
9. ఖైది నంబర్ 150 – $2447043
10. ఫిదా – $2066937