ఘంటసాల వచ్చాడోచ్

0

టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు బయోపిక్ లో సెట్స్ మీద ఉన్నాయి. అలాంటి బయోపిచ్స్ లో అమర గాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ సింగర్ – మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి బయోపిక్ ఒకటి. సింగర్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఇందులో ఘంటసాల పాత్రలో నటిస్తున్నాడు. ‘ఘంటసాల’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదల అయింది.

టీజర్ లో మొదటి సగ భాగం ఇతర బయోపిక్ ల ఇంట్రడక్షన్ కే సరిపోయింది. భాగ్ మిల్ఖా భాగ్.. దంగల్.. MS ధోని.. మహానటి అంటూ ఇప్పుడు ఘంటసాల బయోపిక్ అని ఇంట్రో ఇచ్చారు. ఘంటసాల గాయకుడిగా విజయం సాధించక మునుపు ఎదుర్కొన్న ఇబ్బందులను కొన్ని షాట్స్ లో చూపించారు. యువకుడైన ఘంటసాల పాత్రకు సింగర్ కృష్ణ చైతన్య సూట్ అయ్యాడు.

ధోని సినిమా టీజర్ స్టైల్ లో ఈ సినిమా టీజర్ కట్ చేయాలని చూసినప్పటికీ సరిగా కుదరలేదు. ఎడిటింగ్ సరిగాలేదు. మేకింగ్ చూస్తే షార్ట్ ఫిలిం స్టాండర్డ్ లో ఉంది. టీజర్ కు ఇచ్చిన మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఒక్క టీజర్ చూసి మనం సినిమాపై అంచనాకు రావడం సరికాదు కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడడం బెటర్.. ఆ లోపు మీరు ఈ టీజర్ పై ఒక లుక్కేయండి.

CH. రామారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీత దర్శకుడు. ఈ సినిమాను లక్ష్మి నీరజ నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer