ఇంటి పేరు రాస్తే రచ్చెందుకయ్యా!!

0 ఇవాల్టి రోజుల్లో మీడియా హంగామా బాగా విపరీతం అయిపోయింది. ఏ చిన్న పాయింట్ దొరికినా చాలు.. ఛానల్స్ లోడిస్కషన్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు సంగీత దర్శకుడు గిబ్రాన్ విషయంలో ఓ న్యూస్ ఛానల్ చేసిన హడావిడి అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు భాషలలో సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు గిబ్రాన్.

టైటిల్ కార్డ్స్ లో ఇతని పేరు ఎం.గిబ్రాన్ అని పడుతూ ఉంటుంది. కానీ రీసెంట్ గా విడుదల అయిన విశ్వరూపం2 ట్రైలర్ లోనే మహమ్మద్ గిబ్రాన్ అంటూ నేమ్ కార్డ్ వేశారు. కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాల సంగతి పక్కన పెడితే.. ఓ న్యూస్ ఛానల్ కు ఇలా మహమ్మద్ గిబ్రాన్ అంటూ పేరు వేయడం ఎందుకు హైలైట్ గా అనిపించింది. ఆయన పేరు అదే.. దాన్నే కార్డ్స్ లో వేసుకున్నాడంతే. కానీ ఏకంగా అరడజన్ మందిని ప్యానల్ గా కూర్చోబెట్టేసి గంటలు గంటలు చర్చలు నిర్వహించేశారు. దీనిపై గిబ్రాన్ స్పందించి.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

‘నా పేరు మార్పు ఇంత పెద్ద ఇష్యూ కావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కమల్ గారు మొదట నన్ను కలిసినపుడు నేను ఉపవాసంలో ఉన్నాను. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ సమయానికి కూడా అంతే. అందుకే నేనే అడిగి మహమ్మద్ గిబ్రాన్ గా మార్చుకున్నాను. ఇది దేవుడిపై నా డెడికేషన్’ అని చెప్పుకొచ్చాడు గిబ్రాన్.