యువతి ఫుల్లుగా తాగి పోలీసులతో గొడవ

0girl-detained-drunkకరీంనగర్‌లో ఓ యువతి నానా రచ్చ చేసింది. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడటమే కాకుండా పోలీసులపైనే తిరుగుబాటుకు దిగింది. ఇది తమ వ్యక్తిగత విషయమంటూ వారిపై చిందులేసింది. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, కరీంనగర్‌లో ఓ యువతి నలుగురు యువకులతో కలిసి డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడింది. పోలీసుల అదుపులో ఉండగానే వారిపై తిరగబడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది.

‘ఏంటలా చూస్తున్నారు అందరూ వెళ్లిపోండి.. ఇది మా పర్సనల్‌ విషయం మీకేమిటి. నన్‌ ఆఫ్‌ యువర్ ప్రాబ్లమ్‌‌’.. అంటూ అక్కడ ఉన్నవారిపై తిట్ల వర్షం కురిపించింది. ‘మేం ఏజ్‌ లో ఉన్నాం.. మీకు అర్థమవట్లేదా మేం బయటకు పోతున్నామని, మీకు చెబితే అర్థం కాదా, ప్రూప్స్‌ కావాలా’ అంటూ పోలీసుల మీదకు ఉరికింది. ఆమె పక్కన యువకులు మాత్రం ఇదే తొలిసారి అని, ఆమెకు ఇంతకు ముందు మద్యం తాగడం అలవాటు లేదని, ఈ ఒక్కసారి క్షమించి వదిలేయాలని పోలీసులను బతిమిలాడుతున్నారు. అయినప్పటికీ ఆ యువతి తన స్నేహితులను కూడా పక్కకు లాగేస్తూ పోలీసులపై వాగ్దాటిని చూపించింది. ఇదంతా కూడా ఓ వీడియోలో రికార్డయింది. అయితే, పోలీసులు ఈ వివరాలు బయటకు రాకుండా చూడాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వీడియో బయటపడింది.