సీరియళ్లే సినిమా హీరోయిన్ ను చేశాయి

0ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టే హీరోయిన్లు గుర్తింపు కోసం గ్లామర్ రోల్స్ నే ఎంచుకుంటారు. కానీ కామెడీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేస్తోంది గుజరాతీ భామ సిద్ధి ఇద్నానీ. ఇటు కమెడియన్ గా.. అటు హీరోగా రెండు పడవల ప్రయాణం సక్సెస్ ఫుల్ గా చేస్తున్న శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన జంబలకిడిపంబ మూవీతో సిద్ధి టాలీవుడ్ లో అడుగు పెడుతోంది.

జంబలకిడిపంబ సినిమాలో శ్రీనివాసరెడ్డి భార్య పాత్రలో సిద్ధి కనిపించనుంది. భార్య ప్లేస్ లోకి భర్త.. అతడి ప్లేస్ లోకి భార్య వస్తే ఎలా ఉంటుందనే ఫన్నీ ఎలిమెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అందులో నటనకు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అందుకోసమే సిద్ధిని కావాలనే ఎంపిక చేసుకున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామకు థియేటర్ ఆర్టిస్టుగా ఎక్స్ పీరియన్స్ ఉంది. మరోవైపు మోడలింగ్ లోనూ రాణిస్తోంది. కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందంటోంది సిద్ధి.

‘‘నేను పుట్టిపెరిగిందంతా ముంబయిలోనే. మా అమ్మ చాలా హిందీ టీవీ సీరియళ్ల లో నటించింది. దాంతో నాకూ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెరిగింది. జంబలకిడిపంబ మూవీలో ఓ సీన్ లో సిగరెట్ తాగుతూ కనిపించాల్సి వచ్చింది. అదే రోజు షూటింగ్ స్పాట్ లో అమ్మ కూడా ఉంది. కాస్త ఇబ్బందిగా అనిపించింది. అది ఆ సీన్ కు అవసరం అని అర్ధం చేసుకుంది. ఈ సినిమాలో కామెడీ బ్రహ్మాండంగా వర్కవటువుతుంది’’ అంటూ తన తొలి సినిమా షూటింగ్ అనుభవాలు పంచుకుంది సిద్ధి ఇద్నానీ.