నాణెంపై సీఎం కేసీఆర్ బొమ్మ..!

0తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ సపోర్టర్స్ యూకే అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ఏకంగా కేసీఆర్ బొమ్మతొో బంగారు నాణేలను తయారు చేయించారు. నాణేలకు ఒక వైపు పార్టీ పతాకంలో కేసీఆర్ చిత్రంతోపాటు, ఆయన పుట్టిన తేదీని ముద్రించారు. మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు. టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన టీఆర్‌ఎస్ లండన్ సభ్యులు ఈ మేరకు..ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ నాణేలను ఆవిష్కరింపజేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు కేసీఆర్ అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేయడం జరిగిందని కోర్ కమిటీ సభ్యుడు సురేష్ గోపతి అన్నారు. ఈ నాణేలను సీఎం కేసీఆర్ విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో విందు అనంతరం జరిగిన సమావేశంలో.. ఎన్నారైల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం గొప్పగా అనిపించిందని మరో సభ్యుడు భాస్కర్ వెల్లడించారు.