ఇతడి కోసం గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఫైట్‌

0google-and-facebook-are-fightకేవలం 21 ఏళ్ల యువకుడి కోసం దిగ్గజ కంపెనీలు గూగుల్‌, ఫేస్‌బుక్‌లు పోటీ పడుతున్నాయి. మైఖేల్‌ సేమన్‌ అనే కుర్రాడ్ని అతడికి 17 ఏళ్ల వయసులోనే ఇంటర్న్‌షిప్‌ కోసం, 18 ఏళ్లు రాగానే ఫుల్‌టైమ్‌ ఇంజనీరింగ్‌ జాబ్‌ ఇచ్చేలా ఫేస్‌బుక్‌ రిక్రూట్‌ చేసుకుంది. ఇంటర్న్‌షిప్‌కు ముందే అతడు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌తోనూ భేటీ అయ్యాడు. ఫేస్‌బుక్‌ను యువతకు మరింత చేరువయ్యేలా చేయడంలో సేమన్‌ చొరవ చూపాడు. టీనేజ్‌ యువతకు నచ్చేలా వినూత్న ఉత్పత్తులపై కీలక సూచనలు చేశాడు.

అయితే గత వారం 21 ఏళ్లు వచ్చిన సేమన్‌ ఫేస్‌బుక్‌కు బైబై చెప్పేసి గూగుల్‌లో చేరాడు. సేమన్‌ గూగుల్‌లో అత్యంత పిన్నవయస్కుడైన ప్రోడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాడు.సేమన్‌ 13 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ ట్యుటోరియల్‌ వీడియోలు వీక్షిస్తూ స్వయంగా మొబైల్‌ యాప్స్‌ రూపొందించడం నేర్చుకున్నాడు.