రూ.34 వేల కోట్ల ఫైన్..గూగుల్ కు షాక్

0మోస్ట్ పాపులర్ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు యురోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది . ఏడేళ్లుగా గూగుల్ పై పదుల సంఖ్యలో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. సెర్చ్ లో తన షాపింగ్ సర్వీస్లనే ప్రమోట్ చేసి.. ప్రత్యర్థి కంపెనీల డీమోట్ చేసిందన్న ఆరోపణలు గూగుల్పై ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ యాంటీట్రస్ట్ విభాగం.. గూగుల్ కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17570 కోట్లు) గత ఏడాది జరిమానా విధించింది. దీనికి కొనసాగింపుగా తాజాగా మరో సంచలన తీర్పు వెలువడింది. గూగుల్ కంపెనీకి 4.34 బిలియన్ యుూరోపియన్ డాలర్ల ఫైన్ను యూరోపియన్ యూనియన్ విధించింది.

మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తమ మార్కెట్ ను ఎదగనీయకుండా చేస్తుందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. అమెరికాకు చెందిన గూగుల్ సంస్ధ.. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ముందుగానే గూగుల్స్ సెర్చ్ – బ్రౌజర్ యాప్ డివైస్ లను తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తప్పనిసరిగా ఉంచాలని – లేకపోతే తాము గూగుల్ ప్లే ఆన్ లైన్ స్టోర్ – స్ట్రీమింగ్ సర్వీస్ ను అనుమతించమని చెప్పడాన్ని తప్పబట్టింది. ఆండ్రాయిడ్ ఉపయోగించే విధానంలో గూగుల్ 3రకాలైన అనైతిక చర్యలకు పాల్పడినట్లు తెలిపింది. కొత్త ఆవిష్కరణలను కూడా గూగుల్ అడ్డుకుంటుందని యూరోపియన్ యాంటి ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఇది చట్టవిరుద్దం అని తెలిపింది. గూగుల్ అనైతిక చర్యలకు పాల్పడుతుందని అందుకే ఫైన్ విధించినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది.

యురోపియన్ యూనియన్ ట్విటర్ అకౌంట్ లోనూ గూగుల్ కు జరిమానా విధించిన విషయాన్ని వెల్లడించింది. ఎంతో ముఖ్యమైన మొబైల్ రంగంలో యురోపియన్ యూనియన్ వాసులకు మెరుగైన లబ్ధి చేకూరకుండా గూగుల్ అడ్డుకున్నదని ఈయూ ఆరోపించింది. ఆండ్రాయిడ్ డివైస్ లలో ట్రాఫిక్ అంతా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు వెళ్లేలా ఆండ్రాయిడ్ డివైస్ తయారీదారులు – నెట్ వర్క్ ఆపరేటర్లపై మూడు రకాల నియంత్రణలను గూగుల్ అక్రమంగా విధించింది. ఇలా సెర్చ్ ఇంజిన్ తమ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకోవడానికి ఆండ్రాయిడ్ను ఓ వేదికగా మార్చుకుంది.దీనివల్ల ప్రత్యర్థులకు పోటీ పడే అవకాశాన్ని గూగుల్ లేకుండా చేసింది అని ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్ గ్రెత్ వెస్టాగర్ అన్నారు. 2017లోనూ ఆన్ లైన్ షాపింగ్ కంపారిజన్ విషయంలో గూగుల్ కు దాదాపు రూ.17 వేల కోట్ల జరిమానాను ఈయూ విధించింది. ఇప్పుడు దానికి రెట్టింపు జరిమానా వేయడం విశేషం. మూడేళ్లపాటు గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ పై విచారణ జరిపి ఈ జరిమానా విధించారు.