హీరో చేసిన పనికి దర్శకులు ఫిదా అయ్యారు..

0హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు.. ఆ తర్వాత మళ్లీ విలన్ రోల్స్ చేశాడు. అక్కడ సూపర్ విలన్ గా పేరు తెచ్చుకున్నాక మళ్లీ యూటర్న్.. హీరో అయిపోయాడు.. ఇప్పటికీ హీరోగా 25 సినిమాలు చేశాడు. హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ ఇదీ.. .తాజాగా గోపీచంద్ సంచలన ప్రకటన చేశారు.

‘‘తాను తెరపై నటుడిని మాత్రమేనని.. తనకు అలాంటి పాత్రలను సృష్టించిన దర్శకులే అసలైన హీరోలు’’ అని గోపీచంద్ కామెంట్ చేశాడు. ఆయన తాజాగా నటించిన ‘పంతం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇలా దర్శకులపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తన తొలి సినిమా దర్శకుడు నుంచి లేటెస్ట్ మూవీ పంతం వరకు ప్రతి డైరెక్టర్ ను పంతం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించాడు గోపీచంద్. తన 25 వ సినిమా కావడంతో ఈ అరుదైన కలయికను చేశాడు.

పంతం సినిమా హిట్ – ఫ్లాప్ తో సంబంధం లేదని.. తనతో 25 సినిమాలు చేసిన దర్శకులు – నిర్మాతలను మరోసారి గుర్తుచేసుకోవాలనే వారందరినీ పిలిచానని గోపీచంద్ ఎమోషనల్ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల కొందరు హాజరుకాలేకపోయినప్పటికీ అందరినీ పేరుపేరునా ప్రస్తావించి గోపీచంద్ తనలోని కృతజ్ఞతను చాటుకున్నాడు.