షూటింగ్ చివరి దశకు గౌతమ్ నంద

0Gopichands-next-set-for-mayగోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’ ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో ఉంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు పాటలను దుబాయ్ లో చిత్రీకరించనున్నారు. దుబాయ్ లోని ఫేమస్ లొకేషన్లయిన బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ వంటి వాటిలో ఈ పాటల చిత్రీకరణ జరగనుంది.

ఈ పాటల్లో ఒకటి గోపిచంద్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంది. దీని కోసం భారీ మొత్తం ఖర్చుపెడుతున్నారట నిర్మాతలు. రాజు సుందరం నృత్యాలు కూరచనున్న ఈ పాటల షూటింగ్ మార్చి మధ్య నుండి మొదలుతుంది. జె. భగవాన్, జె . పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. గోపిచంద్ పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.