‘గొరిల్లా’ పోస్టర్ తోనే నవ్వించేస్తోందే!

0ఈ మద్య కాలంలో సినిమాలను తెరకెక్కించడంతో పాటు వాటి ప్రమోషన్ విషయంలో కూడా క్రియేటివిటీగా దర్శకులు ఆలోచిస్తున్నారు. సినిమా తెరకెక్కించడం కంటే ఆ చిత్రంను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం ఎక్కువ కష్టం అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే సినిమా ప్రారంభం అయినప్పటి నుండే అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అందుకే తమ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పుడే ఇందులో ఏదో మ్యాటర్ ఉంది అనిపించేలా ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ క్రియేటివిటీని మొత్తం ఉపయోగించి ఫస్ట్ లుక్ లను రెడీ చేస్తున్నారు.

తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న ‘గొరిల్లా’ చిత్రం ఫస్ట్ లుక్ను విడుదల చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన జీవా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి బేబీ షాలిని పాండే హీరోయిన్ గా కనిపించబోతుంది. డాన్ శాండీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గొరిల్లా’ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఫన్నీగా నవ్వించే విధంగా ఉంది.

సినిమా హీరో జీవాతో పాటు లీడ్ పెయిర్ లను నన్ ల వేషధారణలో చూపించడం జరిగింది. మగవారు నన్ ల వేషధారణ అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇక దానికి తోడు ఒక నిజమైన గొరిల్లాను చాలా స్టైలిష్గా కళ్లద్దాలు పెట్టడంతో పాటు – ఒక ఫన్నీ ఫోజ్ ఇస్తున్నట్లుగా ఫస్ట్ లుక్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ లుక్ నవ్వు తెప్పించే విధంగా ఉండటంతో పాటు – సినిమాకు నన్ లకు ఏమైనా సంబంధం ఉందా సినిమాలో నిజంగా గొరిల్లా ఉంటుందా అంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యి సినిమా గురించి చర్చించుకునేలా పోస్టర్ ఉంది. ఫస్ట్ లుక్ తోనే మంచి ఇంప్రెషన్ కొట్టేయడంతో చిత్రం కూడా తప్పకుండా అలరిస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.