గోవిందం సారు తీసిన గీత ఫోటో

0

ఎప్పుడైతే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జోడీ ‘గీత గోవిందం’ లో జంటగా నటించారో అప్పటి నుంచి యూత్ ఆడియన్స్ కు వారిద్దరూ ఫేవరేట్ జోడీ అయిపోయారు. అర్జున్ రెడ్డి లాంటి రఫ్ గై గా నటించిన విజయ్ ను ఆ సినిమాలో హచ్చి కుక్కలా తన వెంట తిప్పుకుంటూ రష్మిక సతాయించే సీన్లు ప్రేక్షకులకు తెగ నచ్చాయి. ఇప్పుడు అదే జోడీ ‘డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ‘డియర్ కామ్రేడ్’ కేరళ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో ఒక వాటర్ ఫాల్స్ దగ్గర విజయ్ దేవరకొండకు రష్మిక ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోను విజయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. ఫోటో తెగ వైరల్ అయింది. సాధారణ నెటిజనులు మాత్రమే కాదు కొందరు హీరోయిన్లు కూడా ఆ ఫోటోకులైకులు కొట్టారంటేనే ఆ ఫోటోలో విజయ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. ఇక తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను కామ్రేడ్ విజయ్ దేవరకొండ తీసినట్టుగా వెల్లడించింది.

గతంలో విజయ్ ఫోటో తీసిన లొకేషన్ లోనే ఈ ఫోటోను కూడా తీసినట్టుగా ఉంది. క్యాజువల్ టీ షర్ట్.. ప్యాంట్ వేసుకొని.. హెయిర్ ను లూజ్ గా వదిలేసి చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది. పోస్ట్ చేసి ఇంకా ఒకరోజు కూడా కాలేదు.. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల లైక్స్ వచ్చాయి. మరి ఈ ఫోటో కూడా సంచలనం సృష్టించడం ఖాయమేమో.
Please Read Disclaimer