వాట్సాప్ – ఫేస్ బుక్ – ఇన్ స్టాలను ఇండియాలో నిషేధించబోతున్నారా?

0ఉత్తరాది రాష్ట్రాల్లో గో సంరక్షణ పేరుతో గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో ఒక మతానికి చెందిన వారిపై మూకలు దాడి చేసి వారిని చంపడం పెద్ద వివాదంగా మారింది. ఈ దాడుల్లో అమాయకులు చనిపోతున్నారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించడానికి వదంతులు వ్యాపింపజేస్తుండడంతో శాంతిభద్రతల తలనొప్పులు తలెత్తున్నాయి. దీనికంతటికి కారణం కొత్తగా వచ్చిన యాప్లేనని ప్రభుత్వం తీరిగ్గా కళ్లుతెరించింది. శాంతిభద్రతల సమస్య ఏర్పడినప్పుడు లేదా దేశభద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు ఈ యాప్లను బ్లాక్ చేస్తామంటోంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్.

జాతీయ భద్రతకు హాని కలిగే సమయంలో లేదా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనుకున్న సమయంలో యాప్లను బ్లాక్ చేయడంపై తమ తమ అభిప్రాయాలు తెలియజేయాలని టెలికరంగాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం (డాట్) కోరింది. దీంతో పాటు ఈ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులను కూడా మొబైల్ యాప్ లు ఉదాహరణకు ఇన్ స్టాగ్రామ్ – ఫేస్ బుక్ – వాట్స్ యాప్ లతో పాటు టెలిగ్రాంలను బ్లాక్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. డాట్ గత నెల జులై 18వ తేదీన దేశంలోని అన్నీ టెలికం ఆపరేటర్లతో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్ పీఏఐ) ఇండస్ట్రీ బాడీ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ)తో పాటు ఇతరులకు లేఖలు రాసింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద కొన్ని యాప్ అప్లికేషన్స్ ను బ్లాక్ చేయాలనుకుంటున్నామని.. దీనిపై మీమీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ – ఐటితో పాటు న్యాయవ్యవస్థను అమలు చేసే సంస్థలు ఇప్పటికే పలు మార్లు కొన్ని మొబైల్ యాప్స్ ఇన్ స్టాగ్రాం – ఫేస్ బుక్ – వాట్స్ యాప్ – టెలికంలను బ్లాక్ చేయాలని పలుమార్లు తమను కోరిందని ఐటి చట్టంలోని సెక్షన్ 69ఏని వినియోగించాలని కోరినట్లు డాట్ టెలికం ఆపరేటర్లకు రాసిన లేఖలో తెలిపింది.

ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ప్రజలకు కంప్యూటర్ ద్వారా అందించే సమాచారాన్ని బ్లాక్ చేసే హక్కు ఉంటుంది. కేంద్రప్రభుత్వం కానీ.. న్యాయవ్యవస్థ కానీ.. లేదా వీటికి సంబంధించిన ఉన్నతాధికారులకు దేశభద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ సేవలతో పాటు పాటు యాప్ ను బ్లాక్ చేసే అధికారం ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు – లేదా మిత్ర దేశాలతో ఇబ్బందులు తలెత్తినప్పుడు ముందుస్తు జాగ్రత్తగా ఈ యాప్ లను రద్దు చేసే అధికారం చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇంతకు ప్రభుత్వం అకస్మాత్తుగా యాప్స్ పై ఎందుకు దండయాత్ర చేయాల్సి వచ్చిందంటే.. ఇటీవల కాలంలో గోసంరక్షణ పేరుతో గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న అను మానంతో ఒక మతం వారిపై మూకదాడులు చేసి వారిని దారుణంగా హత్య చేయడం – ప్రజల్లో భీతావాహాన్ని సృష్టించడానికి పెద్దెత్తున పుకార్లకు ఈ షోషల్ మీడియాలు వేదికగా మారాయి. ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన మేసిజింగ్ యాప్స్ వాట్స్ యాప్ పై పెద్ద దుమారం చెలరేగుతోంది. వాట్స్ యాప్ ద్వారా వచ్చే ఈ సమాచారం ఎక్కడి నుంచి వస్తోంది ఇట్టే పసిగట్టలేకపోతున్నారు. ఫేస్ బుక్ మెసేజింగ్ ఫ్లాట్ ఫాం ద్వారా జరిగే వాటిపై దృష్టి పెట్టాలని – అనుకోని సంఘటనటు జరిగితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫేస్ బుక్ కు కూడా నోటీసిచ్చింది. దీంతో వాట్సాప్ – ఫేస్ బుక్ వంటి సర్వీసులపై కేంద్రం నియంత్రణ చర్యలు మొదలుపెట్టొచ్చని తెలుస్తోంది.