జీఎస్టీ లేని వస్తువులను ప్రకటించిన కేంద్రం!

0Govt-fixes-GST-rates-on-allజులై 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ( జీఎస్టీ) అమల్లోకి రానున్న తరుణంలో ఏయే వస్తువులపై ఈ పన్ను పడదో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆహార పదార్థాలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, సెనగపిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్క్, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేతి వృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామగ్రికి జీఎస్టీ నుంచి మినహాయింపు నిస్తున్నట్టు పేర్కొంది. అయితే, బ్రాండెడ్ ఆహార పదార్థాలపై 5 శాతం పన్ను ఉంటుందని తెలిపింది. జీఎస్టీ అమలుతో ప్రస్తుతం కంటే నాలుగు నుంచి ఐదు శాతం ధరలు తగ్గుతాయని విశ్లేషకుల అంచనా.